ఏపీలో సగానికి తగ్గిపోయిన పేదలు ! కారణమేంటో చెప్పిన వైసీపీ ఎంపీ

వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పేదలు సగానికి తగ్గిపోయారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి(Vjayasai reddy ) సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.ఏపీలో వైసిపి( YCP ) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత , సీఎం జగన్( CM Jagan) సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేయడం,  నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సొమ్ములు జమ చేయడం కారణంగానే ఇదంతా జరిగినట్లుగా విజయసాయిరెడ్డి చెబుతున్నారు .

 Andhra Pradesh Has The Poor In Ap Reduced By Half With Jagans Schemes Ysrcp Mp V-TeluguStop.com

తాజాగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం పేదరికం పై ఏ విధంగా ఉంది అనే అంశంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.దీంట్లో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు( scheems ) పూర్తిగా సత్ఫలితాన్ని ఇస్తున్నాయని , ఏపీలో పేదలు సగానికి తగ్గిపోయారని విజయసాయి వెల్లడించారు.

Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politics11.77% నుంచి 6.06% కి పేదరికం తగ్గిపోయిందని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.ఇక గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడినట్లుగా నీతి అయోగ్ ఇటీవలే ఓ నివేదికను బయటపెట్టింది.దీంట్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ముందున్నట్లు కూడా నీతి అయోగ్ పేర్కొంది.

ఏపీలోనూ గత ఐదేళ్లలో పేదరికం సగానికి తగ్గిపోయిందని విజయ సాయి రెడ్డి పేర్కొనడంతో వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చ మొదలైంది.ఆ  రిపోర్టును కూడా ప్రస్తావించారు.నీతి అయోగ్ ఏపీకి ఇచ్చిన 10% లోపు పేదరికం టార్గెట్ ను తాము అధిగమించామని,  ఇప్పుడు ఏపీలో కేవలం 6.06% పేదలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.” సీఎం(CM ) గారి సంక్షేమ పథకాలు ఫలితాన్ని ఇస్తున్నాయి.ఐదేళ్లలో ఏపీలో సగం తగ్గిన పేదలు -11.77 నుంచి 6.06 శాతానికి తగ్గుదల.నీతి అయోగ్ (Niti Aayog) నిర్దేశించిన 10 శాతం లోపు టార్గెట్ చేరిన ఆంధ్ర( Andhra ).పెత్తందారుల ఆగడాలు రాష్ట్రంలో సాగవు.” అంటూ విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు.

Telugu Ap, Chandrababu, Cog, Vijayasaieeddy, Ysrcp, Ysrcp Mp-Politicsఏపీలోని  విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజలకు ఇదే విధంగా సంక్షేమ పథకాలు అందించి పేదరికం తగ్గిస్తామని విజయసాయిరెడ్డి పరోక్షంగా పేర్కొన్నారు.చాలా కాలం నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఉచిత పథకాల తో ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, జగన్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.అప్పులు చేయడమో, ఇతర పథకాలకు సంబంధించిన నిధులను మళ్లించో సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నారు.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా, పట్టించుకోనట్టుగానే ముందుకు వెళ్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube