సాయి పల్లవికి చాక్లెట్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. నెట్టింట్లో రచ్చ?

టాలీవుడ్ హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.

 Andhra Jyoti Radhakrishna Gives Chocolate To Sai Pallavi Viral On Social Media ,-TeluguStop.com

తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని ప్రస్తుతం కెరీర్ ను వెనుతిరిగి చూడకుండా వరుస ఆఫర్ లతో ముందుకు దూసుకుపోతుంది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఎంతో హోమ్లీగా కనిపించే సాయి పల్లవి అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక ఈమె సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండకపోయినా.

అప్పుడప్పుడు మాత్రం తన ఫోటోలను, ఫ్యామిలీ ఫోటోలను, తన ప్రాజెక్ట్ అప్ డేట్ లను అభిమానులతో పంచుకుంటుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంది.వేణు దర్శకత్వంలో హీరో రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా తను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొనింది.

అందులో తన గురించి చాలా విషయాలు పంచుకుంది.నిజానికి ఆర్కే ఇంటర్వ్యూ అంటే వచ్చిన గెస్ట్ లు బాగా టెన్షన్ పడుతూ కనిపిస్తుంటారు.

అలా సాయి పల్లవి కూడా కాస్త కంగారు పడిన.ఆ తర్వాత తాను కూడా కూల్ గా కనిపించింది.

Telugu Andhra Jyoti, Radhakrishna, Sai Pallavi-Movie

ఇక అందులో ఆర్కే మీరు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా అనటంతో.మా నాన్న కూడా అదే మాట అన్నారు అని సాయి పల్లవి తెలిపింది.ఇక తన ఎడ్యుకేషన్ గురించి, డాన్స్ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది.ఆ తర్వాత ఇండస్ట్రీ అనే గ్లామర్ ప్రపంచంలో ఇంత పద్ధతిగా ఉండి మంచి విజయం సాధించవచ్చునన్న ఉదాహరణ మీరే అని అది ఎలా సాధ్యం అనడంతో.

నాకు కంఫర్ట్ లేకపోతే చెయ్యను.వెళ్లి చదువుకోవడం చేస్తాను అన్న నమ్మకం నాకు ఉంది.దానికే కట్టుబడి ఉన్నాను అని తెలిపింది.ఇక సాయి పల్లకి చాక్లెట్ అంటే ఇష్టం ఉండటంతో ఆర్కే ఆమెకు చాక్లెట్ ఇచ్చి సర్ ప్రైస్ చేశాడు.

ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube