జయమ్మ పంచాయతీ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ చాలా కాలం తర్వాత వెండితెరపై జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా సందడి చేశారు. విజయ్ కుమార్ కలివరుపు దర్శకత్వం లో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రం మే 6వ తేదీ విడుదలైంది.

 Jayamma Panchayathi Ott Release Date Confirmed, Jayamma Panchayathi ,ott,anchor-TeluguStop.com

ఈ సినిమా విడుదల కాకముందు సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అనుకున్న స్థాయిలో సుమ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయ లేకపోయినప్పటికీ నటిగా సుమ మాత్రం అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.మే 6వ తేదీ థియేటర్ లో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా థియేటర్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాని జూన్ 14వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

జాలి, దయ మొండితనం కలిగిన ఓ మహిళ.తన కుటుంబ సమస్యలతోపాటు.

ఊళ్లో సమస్యల పట్ల పోరాడుతుంది.

Telugu Anchor Suma, Ott, Telugu, Tollywood-Movie

ఒకవైపు అనారోగ్య సమస్యతో ఉన్న తన భర్తను ఎలా కాపాడుకుంటుంది, ఇన్ని సమస్యల నడుమ పంచాయతీలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.బుల్లితెరపై యాంకర్ గా అలరించిన సుమ పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా వెండితెర అరంగ్రేటం చేశారు.థియేటర్లో పర్వాలేదనిపించిన ఈ సినిమా ఓటీటీలో జూన్ 14వ తేదీ ప్రసారం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube