ఇప్పుడు జనాలంతా సెల్ మయం అయిపోయారు.సెల్ ఫోన్ లోకంగా బతుకుతున్నారు.
అన్నం లేకపోయినా పర్వాలేదు ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా తయారయ్యారు.ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉన్నవారిలో వాట్సాప్ లేనివారు కనిపించనే కనిపించరు.
అంతగా దానికి కనెక్ట్ అయిపోయారు.దీనికి కారణం ఫోటోలు, మెసేజ్ లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఇలా అన్నిటికి సౌకర్యవంతంగా ఈ అప్లికేషన్ ఉండడంతో దీనికి ఆదరణ ఎక్కువైంది.
అయితే ప్రస్తుతం వాట్సాప్ లో ఓ చిన్న లోపం కారణంగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.దాడులు కూడా ఎంపి4 వీడియో రూపంలో వస్తున్నట్టుగా వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ హెచ్చరికలు జారీ చేసింది.
గుర్తుతెలియని సోర్స్ ద్వారా వచ్చే వీడియో లింకులపై అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ను డిజేబుల్ చేయడం ద్వారా కొంతవరకు ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అంటూ సూచించింది.
ప్రస్తుతం వాట్స్అప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్డేట్ చేసుకుంటే సైబర్ దాడుల నుంచి తప్పించుకోవచ్చని ప్రకటించింది ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాట్స్అప్ యూజర్లు పెగాసస్ అనే స్పైవేర్ బారిన పడిన విషయం తెలిసిందే.
ఇంతలోనే మరో ఎటాక్ పొంచి ఉండడంతో వాట్సాప్ వినియోగదారుల్లో ఆందోళన మొదలయ్యింది.