మామూలుగా సినిమాలు ( Movies ) విడుదల అయితే మనం డబ్బులు కట్టి మరీ సినిమాలు చూడడానికి వెళుతూ ఉంటాం.అలాగే మూవీ చూసిన తరువాత ఉచితంగా రివ్యూలు( Movie Reviews ) చెబుతూ ఉంటాం.
కానీ ఇప్పుడు మాత్రం సినిమాలో చూస్తే ఏకంగా లక్షల్లో డబ్బులు ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు.అయితే ఇది ఫేక్ కాదండోయ్ రియల్.
ఇలా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఒక అమెరికన్ కంపెనీ. కేవలం సినిమా చూసి వారి అభిప్రాయం చెప్తే చాలు డబ్బులు ఇస్తామని చెబుతోంది.
యూఎస్‌కు చెందిన బ్లూమ్‌సీబాక్స్( Bloomsybox ) అనే సంస్థ ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
వివిధ సంవత్సరాల్లో రిలీజ్ అయిన సినిమాలను చూసి రివ్యూ ఇస్తే చాలట.
క్రిస్మస్ కు వచ్చిన సినిమాలను చూసి రివ్యూ ఇవ్వాలట.ఇలా ఒకటి రెండు సినిమాలు కాదండోయ్ ఏకంగా 12 సినిమాలు చూసి రివ్యూ ఇవ్వాలని కోరింది సదరు సంస్థ.
ఎంపికైన వాళ్లు సినిమాలు చూసి ఆ రివ్యూని ఇన్స్టాగ్రామ్ లో ( Instagram ) పోస్ట్ చేస్తే చాలట.ఆ రివ్యూలను బట్టి కొంతమందిని ఎంపిక చేస్తుంది సదరు కంపెనీ.ఎంపికైన వారికి 2000 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1.6 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేశారు.

అయితే ఇందులో ఎంపికైన వారికి డబ్బులతో పాటు హాట్ కోకా, యూజీజీ సాక్స్‌లు, పీకాక్‌కి ఒక ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్, 12 నెలల ఫ్లవర్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆ కంపెనీ అందజేస్తుందట.వినడానికి అద్భుతంగా ఉన్న ఈ ఆఫర్లు సొంతం చేసుకోవాలని మీకు కూడా ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ సినిమాలు చూసేయండి.మరి ఆ 12 సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.
1.ది మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ (2008)
2.
క్రౌన్ ఫర్ క్రిస్మస్ (2015)( Crown for Christmas )
3.ది నైన్ లైవ్స్ ఆఫ్ క్రిస్మస్ (2014)
4.క్రిస్మస్ గెటవే (2017)
5.జర్నీ బ్యాక్ టు క్రిస్మస్ (2016)
6.గోస్ట్స్ ఆఫ్ క్రిస్మస్ ఆల్‌వేస్ (2022)

7.ఫ్యామిలీ ఫర్ క్రిస్మస్ (2015)( Family for Christmas )
8.క్రిస్మస్ అండర్ రాప్స్ (2014)
9.త్రీ వైస్ మెన్ అండ్ ఏ బేబీ (2022)
10.ఎ రాయల్ క్రిస్మస్ (2014)
11.నార్త్‌పోల్ (2014)
12.ది క్రిస్మస్ ట్రైన్ (2017)