జూన్ 18వ తేదీ ఫాదర్స్ డే ( Fathers Day ) కావడంతో ప్రతి ఒక్కరు తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోని సెలబ్రిటీలు కూడా తమ తండ్రులకు ఫాదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సైతం తన తండ్రి అల్లు అరవింద్ ( Allu Aravind ) కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ… ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.ప్రపంచంలో బెస్ట్ ఫాదర్( Best Father ) అయిన మీకు ప్రత్యేకంగాశుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ తన తండ్రికి ఈయన ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక తన తండ్రి అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ కు ఎంతో అమితమైన గౌరవం ప్రేమ ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే.
గత కొద్దిరోజుల క్రితం ఒక షోలో పాల్గొన్నటువంటి అల్లు అర్జున్ తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.ఆ దేవుడు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు కనిపించే దేవుడు మాత్రం మా నాన్న.ఆయనే నాకు దేవుడు అంటూ తన తండ్రి గురించి అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఇలా తండ్రి గురించి ఎంతోగొప్పగా చెబుతూ అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.