ఒక వ్యక్తి హీరోగా రాణించాలి అంటే దానికి తగ్గట్టు అన్ని క్వాలిటీస్ ఉండాలి.లేదంటే వేస్ట్.
కేవలం హ్యాండ్సమ్ లుక్ మాత్రమే కాకుండా డాన్స్, డైలాగ్స్ చెప్పడం, ఫైటింగ్ సీన్స్, ఇతర టాలెంట్స్ వంటివి ఉంటేనే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగగలరు.ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వారసత్వాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వారసులు అడుగుపెట్టి స్టార్ పొజిషన్లో దూసుకుపోతున్నారు.
అయితే త్వరలో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ( Mokshagna ) కూడా సినీ ఇండస్ట్రీకి హీరోగా అడుగు పెడుతున్నాడు అని గత కొన్ని రోజుల నుండి జోరుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం నందమూరి బాలయ్య( Balakrishna ) టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతలా దూసుకుపోతున్నాడో చూస్తూనే ఉన్నాం.
చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు.ఈ వయసులో కూడా ఈయన కుర్ర హీరోలాగా డాన్సులు, ఫైట్ సీన్స్ లలో అదరగొట్టేస్తున్నాడు.
ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగులు మాత్రం మామూలుగా ఉండవని చెప్పాలి.

తన అన్న కొడుకు అయిన ఎన్టీఆర్( Jr ntr ) కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు.కానీ తన కొడుకుని మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.దీంతో ఎలాగైనా తన కొడుకుని హీరోగా పరిచయం చేయాలి అని.తన వారసుడికి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు రావాలి అని కోరుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన కొడుకు మోక్షజ్ఞకు నటనకు కావాల్సిన స్కిల్స్ అన్ని నేర్పించినట్లు తెలిసింది.పైగా మోక్షజ్ఞ ఒకప్పుడు లావుగా ఉండేవాడు.ఇప్పుడు హీరోగా కావటానికి బాగా డైట్ పాటించి సన్నబడ్డాడు.
మెల్లిమెల్లిగా హీరో లక్షణాలకు చేరుకుంటున్నాడు.అయితే గతంలో ఈయనకు ఒక సినిమాలో అవకాశం వచ్చిందని జోరుగా వార్తలు వచ్చాయి.

కానీ మళ్ళీ దాని గురించి ఎటువంటి టాపిక్ ఇప్పటివరకు రాలేదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మోక్షజ్ఞ గురించి ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారుతుంది.అదేంటంటే బాలయ్య కొడుకు హీరోగా సక్సెస్ కావాలి అంటే ఆయనలో కొన్ని టాలెంట్ ఉండాలి అని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.అటువంటి టాలెంట్ ఉంటేనే తండ్రికి తగ్గ కొడుకుగా అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు.
లేదంటే హీరోగా పనికిరాడు అని అంటున్నారు.మరి ఇంతకు జనాలు ఆయన నుండి ఎటువంటి టాలెంట్ ఆశిస్తున్నారు అంటే.
ఆయన నుంచి అద్భుతమైన డైలాగ్ డెలివరీ, టైమింగ్ ను కోరుకుంటున్నారు.ఇక ముఖ్యంగా డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో మంచి పట్టు ఉండాలి అని ఆశిస్తున్నారు.
ఇక ఇతర హీరోలకు భిన్నంగా నటన విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో మోక్షజ్ఞ తన ప్రత్యేకతను చాటుకోవాలి అని.ఈ పరంగా ఆయన ప్రజలను మెప్పిస్తే చాలు అని కచ్చితంగా స్టార్ హీరో అవ్వటం గ్యారెంటీ అని అంటున్నారు.మరి మోక్షజ్ఞ ఈ టాలెంట్ లతో ముందుకు వస్తాడో లేదో చూడాలి.