తెలంగాణలో ఎన్నికల వేల పొత్తు వ్యవహారాలు క్షణ క్షణం కొత్త మలుపులు తిరుగుతున్నాయి.అధికార బిఆర్‌ఎస్ ( Brs )ఎప్పటిలాగే ఏంఐఏంతో పొత్తు కన్ఫర్మ్ అని తెలిపింది.
మజ్లిస్ పార్టీ అండతో హైదరబాద్, రంగారెడ్డి జిల్లాలో బిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.ఇటు కాంగ్రెస్ ( Congress )బీజేపీ లు కూడా పొత్తులపై కొత్త ఎత్తులు వేస్తున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న త్రిముఖ పోరులో వామపక్షాలు ఎటువైపు వెళ్తాయనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఎందుకంటే మునుగోడు ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ తో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు.
![Telugu Comrade, Congress, Khammam, Nalgonda, Telangana-Politics Telugu Comrade, Congress, Khammam, Nalgonda, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Alliance-with-comrades-will-Congress-joinb.jpg)
సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి బిఆర్‌ఎస్ అధినేత కామ్రేడ్ పార్టీలను( Comrade parties ) పక్కన పెట్టేశారు.దీంతో కేసిఆర్ మిత్రా ద్రోహం చేశాడని సిపిఎం, సిపిఐ పార్టీలు వాపోతున్నాయి.తుదకు ఈ ఎన్నికల్లో కేసిఆర్ అను ఎలాగైనా ఓడించి తీరుతామని, తమతో కలిసి నడిచే పార్టీలతో కలుస్తామని వామపక్షాలు చెప్పుకొచ్చాయి.దీంతో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోందట.
ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో( Khammam , Nalgonda ) వామపక్షాల ప్రభావం గట్టిగా ఉంటుంది.అందుకే కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకుంటే కాంగ్రెస్ కు కలిసొస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారట.
![Telugu Comrade, Congress, Khammam, Nalgonda, Telangana-Politics Telugu Comrade, Congress, Khammam, Nalgonda, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Alliance-with-comrades-will-Congress-joinc.jpg)
అయితే ఒకవేళ వామపక్షాలతో పొత్తు ఏర్పడితే సీట్ల విషయంలో సర్దుబాటు జరగాల్సి ఉంటుంది.అందుకే వామపక్షాలు ఎక్కువ సీట్లు అడగకుండా పరిది మెరగే కామ్రేడ్స్ ను కంట్రోల్ చేయాలని టి కాంగ్రెస్ నేతలు( t Congress leaders ) భావిస్తున్నారు.అందులో భాగంగానే నేడు వామపక్ష నేతలతో కాంగ్రెస్ లోని కీలక నేతలు బేటీ కానున్నట్లు తెలుస్తోంది.ఈ బేటీ అనంతరం సీట్ల కేటాయింపుపై ఆ అభిప్రాయానికి వచ్చి, పొత్తు ఉందా లేదా అనే విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ఒకవేళ పొత్తు కన్ఫర్మ్ అయితే కమ్యూనిస్ట్ పార్టీలకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ఆసక్తికరం.మరి గెలుపే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీకి వామపక్షాల పొత్తు ఎంతవరుకు కలిసొస్తుందో చూడాలి.