బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి.
మిర్జాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 20 లోని భూమిపై వివాదం గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, వెంకటేశ్వర రావు, కవితారావుపై గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
తమకు చెందిన భూమిని కబ్జా చేశారని ముగ్గురు వ్యక్తులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.
మేయర్ విజయలక్ష్మీ తమ భూమిలో ఫెన్సింగ్ ధ్వంసం చేశారని మల్లేశ్ అనే బాధితుడు ఆరోపించారు.
భూముల సర్వే చేసిన తర్వాతే కంచె పాతుకోవాలని చెప్పామన్నారు.దీంతో తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు.
మరోవైపు మిర్జాపూర్ గ్రామస్తుల ఆరోపణలను వెంకటేశ్వర రావు ఖండించారు.తానెవరినీ బెదిరించలేదని చెబుతున్నారు.
ఈ వివాదంపై వెంకటేశ్వర రావు తుపాకీతో బెదిరించినట్లు ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.