దేవర సినిమాలో ఆ పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు హీరో అల్లరి నరేష్( Hero Allari Naresh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నరేష్ ప్రస్తుతం సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

 Allari Naresh Reacts On Devara Movie, Allari Naresh, Devara Movie, Tollywood, Nt-TeluguStop.com

అందులో భాగంగానే నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

ఈ సందర్భంగా నరేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ప్రమోషన్స్ లో భాగంగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న నరేష్ వ్యక్తిగత విషయాలు సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవర సినిమా ( Devara movie ) గురించి ప్రశ్న ఎదురవగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.దేవర సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అల్లరి నరేశ్‌ను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం ఆసక్తి చూపిందని వార్తలు సినిపించాయి.దానికి మీరు నో చెప్పారా? ఇంకేదైనా కారణమా? అని అడగగా.నరేష్ మాట్లాడుతూ.

ఆ సినిమాలో ఛాన్స్‌ గురించి నాకే తెలియదు.అది రూమర్‌ అని, ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని అన్నారు.

ఇకపోతే దేవర విషయానికి వస్తే. కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా దసరా పండుగ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube