అయోధ్య వైపే అందరి చూపు ..! 

దేశం మొత్తం అయోధ్య వైఫై చూస్తోంది.అయోధ్యలో నేడు రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ( Ram Mandir )జరగనుంది.

 All Eyes Towards Ayodhya, Ayodhya, Ayodaya Ramayya, Prime Minister Of India, Utt-TeluguStop.com

మహత్ ఘట్టానికి కేవలం కొద్ది గంటలు సమయం మాత్రమే ఉంది.ఈరోజు రామ మందిరంలో జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) అయోధ్యకు రానున్నారు.మధ్యాహ్నం 12.29 గంటలకు రామ విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది.ఈ మహా పుణ్య కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల నుంచి అనుస్థానం నిర్వహిస్తున్నారు.

పత్యేకంగా పూజలు చేయిస్తున్నారు.హిందూ ధర్మం ప్రకారం ప్రాణ ప్రతిష్ట చేసేవారు అనుష్ఠానం చేయాల్సి ఉంటుంది.

దీంతో ప్రధాని గత కొద్ది రోజుల నుంచి ఉపవాస దీక్ష చేపట్టారు నేలపై నిద్రిస్తున్నారు.దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తూ ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనని గడుపుతున్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం 10:30 కి అయోధ్యలోని మహర్షి వాల్మీకి( Maharishi Valmiki ) అంతర్జాతీయ ప్రమాణశ్రమంలో దిగనున్నారు.

Telugu Ayodaya Ramayya, Ayodhya, Prime India, Uttarapradesh-Politics

ఉదయం 11 గంటలకు రామాలయానికి చేరుకుంటారు .అక్కడి నుంచి 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు 12 .55 వరకు బాలరాముడు 50 యొక్క అంగుళాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు నాలుగు వేల మంది సాధువులు పాల్గొనబోతున్నారు.అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది అతిరథ మహారాజులు అయోధ్యకు ఇప్పటికే వచ్చారు.లక్షల మంది భక్తులు దేశవ్యాప్తంగా అయోధ్యకు తరలి వచ్చారు.

Telugu Ayodaya Ramayya, Ayodhya, Prime India, Uttarapradesh-Politics

ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లైన్ లో ప్రచారం  చేయనున్నారు.250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున నాగార శైలిలో నిర్మించిన అయోధ్య రామాలయం ను సందర్శించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది జనాలు అయోధ్యకు చేరుకుంటున్నారు.దీనికోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.13 వేల మంది పోలీసులు భద్రత విధుల్లో ఉన్నారు.అలాగే పదివేల సీసీ కెమెరాలు, యాంటీ మైండ్ డ్రోన్లు ఏర్పాటు చేశారు.

వీటి కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని ( Artificial Intelligence Technology )వాడుతున్నారు.దీంతోపాటు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.

ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. నేడు అందరి చూపు అయోధ్య వైపే .అందరినోటా అయోధ్య రాముడి నామ జపమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube