ఆలీ గురి రాజ్యసభ కాదా ? ఆ పదవా ?

తెలుగు సినీ కమెడియన్ ఆలీ వ్యవహారంపై కొద్ది రోజులుగా వైసీపీ లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రస్తుతం ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని ఆలీకి కేటాయించబోతున్నారని, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 Ali Statement On Rajyasabha Seat Issue , Comedian Ali, Ali, Actor Ali, Ysrcp, J-TeluguStop.com

కానీ అభ్యర్థుల ఎంపిక లిస్టులో ఆలీ పేరు మిస్సయింది.దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అని, త్వరలోనే ఆయన పార్టీని వీడనున్నారని సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

అయితే ఈ వ్యవహారంపై స్వయంగా ఆలీ స్పందించారు.తాను ఎటువంటి అసంతృప్తికి గురవు లేదని , సంతృప్తిగానే ఉన్నానని,  తనకు ఏం చేయాలో జగన్ కు బాగా తెలుసునని… జగన్ ఏ పదవి ఇచ్చిన సంతృప్తిగా స్వీకరిస్తాను అని ప్రకటించారు.
  జగన్ పై తనకు పూర్తిగా నమ్మకం ఉందని , జగన్ కోసం విధేయతతో పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు.  అయితే అసలు ఆలీ టార్గెట్ ఏంటి ?  వైసీపీలో ఆయన ఏం ఆశిస్తున్నారనే విషయం పైన ఆసక్తి నెలకొంది.వాస్తవంగా 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆలీ ఉత్సాహం చూపించారు.తన సొంత ప్రాంతమైన రాజమండ్రి నుంచి పోటీ చేయాలని చూసినా,  సామాజిక వర్గాల లెక్కల్లో ఆలీ కి ఆ సీటు దక్కలేదు.

గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తారని భావించినా, అదికూడా మిస్ అయింది.దీంతో ఆలీ కి ఏదో ఒక నామినేటెడ్ పదవి  దక్కుతుందని భావిస్తుండగా, ఆలీ మాత్రం తన మనసులో మాట బయటపెట్టారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాలన్నది తన కోరిక అని చెప్పారు.
 

Telugu Ali, Ap Cm, Ap, Jagan, Rajyasabha, Ysrcp-Politics

2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి కానీ లేక గుంటూరు జిల్లా నుంచి కానీ ఆలీ కచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు , ఈ మేరకు జగన్ నుంచి హామీ పొందినట్లు ప్రచారం జరుగుతోంది.ఎమ్మెల్యేగా గెలిచి … మంత్రి అవ్వాలనే కోరికతో ఉన్న ఆలీ రాజ్యసభ స్థానం విషయం లో ఎటువంటి అసంతృప్తి కి గురవ్వ లేదట.అసలు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేయలేదని చెబుతుండడంతో ఆయన రాజ్యసభ విషయంలో అసంతృప్తికి గురయ్యారు అనే వార్తల్లో నిజం లేదు అనే విషయం తేలుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube