జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారాలా.. అయితే ఈ రెమెడీ గురించి తప్పక తెలుసుకోండి!

జుట్టు ఒత్తుగా సిల్కీ గా మెరుస్తూ కనిపించాలని చాలా మంది కోరుకుంటున్నారు.అయితే కొందరి జుట్టు ఒత్తుగా( Thick Hair ) ఉంటుంది కానీ సిల్కీ గా ఉండదు.

 Follow This Home Remedy For Thick And Silky Hair Details,  Home Remedy, Hair Pac-TeluguStop.com

ఇంకొందరు జుట్టు సిల్కీ గా ఉంటుంది కానీ ఒత్తుగా ఉండదు.మీరు ఏ క్యాటగిరి లో ఉన్నారు అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం మీ జుట్టును ఒత్తుగానే కాకుండా సిల్కీగా ( Silky Hair ) కూడా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాట‌ర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే మూడు లేదా నాలుగు మందార ఆకులు, ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు( Rose Petals ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Aloevera, Care, Care Tips, Fall, Pack, Healthy, Remedy, Mud Oil, Rose Pet

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే బోలెడు లాభాలు ఉన్నాయి.ఈ రెమెడీ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని( Hair Fall ) అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అలాగే కలబంద, మందారం, గులాబీ రేకులు మరియు ఆవ నూనెలో ఉండే పోషకాలు జుట్టుకు మంచి తేమను అందిస్తాయి.

సిల్కీగా షైనీ గా మెరిపిస్తాయి.ఒత్తయిన మరియు సిల్కీ హెయిర్ ను కోరుకునేవారికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

Telugu Aloevera, Care, Care Tips, Fall, Pack, Healthy, Remedy, Mud Oil, Rose Pet

అంతేకాకుండా చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఒక్కసారి చుండ్రు వచ్చిందంటే ఓ పట్టాన పోదు.దీంతో చుండ్రును ఎలా వదిలించుకోవాలో తెలియక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంటారు.అలాంటి వారు కూడా ఈ రెమెడీ ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.ఈ రెమెడీని పాటించడం వల్ల రెండు మూడు వాషుల్లోనే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube