జుట్టు ఒత్తుగా, సిల్కీగా మారాలా.. అయితే ఈ రెమెడీ గురించి తప్పక తెలుసుకోండి!

జుట్టు ఒత్తుగా సిల్కీ గా మెరుస్తూ కనిపించాలని చాలా మంది కోరుకుంటున్నారు.అయితే కొందరి జుట్టు ఒత్తుగా( Thick Hair ) ఉంటుంది కానీ సిల్కీ గా ఉండదు.

ఇంకొందరు జుట్టు సిల్కీ గా ఉంటుంది కానీ ఒత్తుగా ఉండదు.మీరు ఏ క్యాటగిరి లో ఉన్నారు అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం మీ జుట్టును ఒత్తుగానే కాకుండా సిల్కీగా ( Silky Hair ) కూడా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాట‌ర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే మూడు లేదా నాలుగు మందార ఆకులు, ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు( Rose Petals ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే బోలెడు లాభాలు ఉన్నాయి.ఈ రెమెడీ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది.

జుట్టు రాలడాన్ని( Hair Fall ) అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.అలాగే కలబంద, మందారం, గులాబీ రేకులు మరియు ఆవ నూనెలో ఉండే పోషకాలు జుట్టుకు మంచి తేమను అందిస్తాయి.

సిల్కీగా షైనీ గా మెరిపిస్తాయి.ఒత్తయిన మరియు సిల్కీ హెయిర్ ను కోరుకునేవారికి ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.

"""/" / అంతేకాకుండా చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఒక్కసారి చుండ్రు వచ్చిందంటే ఓ పట్టాన పోదు.

దీంతో చుండ్రును ఎలా వదిలించుకోవాలో తెలియక తీవ్రంగా స‌త‌మ‌తం అవుతుంటారు.అలాంటి వారు కూడా ఈ రెమెడీ ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఈ రెమెడీని పాటించడం వల్ల రెండు మూడు వాషుల్లోనే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది.

అక్కడ వైసీపీ టిడిపి లకు టెన్షన్ పుట్టిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి