ఇద్దరు సీనియర్ హీరోలతో పోటీకి సిద్దమైన అక్కినేని అఖిల్.. గెలుస్తాడా?

దసరా వచ్చిందంటే చాలు పండగ సంబరాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దసరాకు కొన్ని రోజుల ముందు నుంచే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

 Akkineni Akhil Competition With Senior Heros Chiranjeevi Balakrishna Details, A-TeluguStop.com

అందరూ ఒకచోట చేరి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.అయితే దసరా అంటే కేవలం సాంప్రదాయమైన ఉత్సవాలు మాత్రమే కాదు అటు సినీ ఉత్సవాలు కూడా బాగానే జరుగుతూ ఉంటాయి.

ఎందుకంటే ఎంతో మంది స్టార్ హీరోలు తమ సినిమాలను దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు.

దసరా సీజన్లో విద్యాసంస్థలకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తే ఇక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని భావిస్తూ ఉంటారు.

ఈ ఏడాది దసరాకు కూడా సినిమాలను విడుదల చేసేందుకు పలువురు హీరోలు సిద్ధమయ్యారు.కాగా ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఉండబోతోందని తెలుస్తోంది.

ఇలా దసరా బరిలోకి దిగేందుకు సిద్ధమైన హీరోలలో ఇద్దరు సీనియర్లు ఉంటే ఒక జూనియర్ హీరో కూడా ఉన్నాడు.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట.

Telugu Nbk, Akhil, Akkineni Akhil, Chiranjeevi, Dasara, Surender Reddy, God, Tol

నందమూరి నటసింహం బాలయ్య నటించిన తన 107వ సినిమా షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో మిగతా అన్ని పనులు పూర్తి చేసుకొని దసరాకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట మేకర్స్.ఈ సమయంలో యువ హీరో అక్కినేని అఖిల్ సైతం దసరా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు.ఇప్పటికే షూటింగ్ ముగియడంతో ఇక డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని దసరా పోటీలో ఏజెంట్ సినిమాను దింపాలని భావిస్తున్నాడట.ఇలా ఇద్దరు సీనియర్ హీరోలు ఒక జూనియర్ హీరో మధ్య బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటే ఇక ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube