సెల్ఫీ కోసం ఎగబడిన అభిమాని.. సెక్యూరిటీ పై ఆగ్రహం వ్యక్తం వేసిన రష్మిక!

ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

 Actress Rashmika Angry On Her Bodyguard From Manhandling A Fan, Rashmika Mandan-TeluguStop.com

ఒకవైపు సినిమా షూటింగులతో బిజీగా గడిపే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భాగంగా రష్మిక షూటింగ్ లోకేషన్ నుంచి కేరవాన్ లోకి వెళుతున్న సమయంలో కొంతమంది అభిమానులు తనతో ఫోటోలు దిగడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.ఇక అభిమానుల కోసం రష్మిక కూడా కాస్త ఓపిక చేసుకొని ఎంతో క్యూట్ స్మైల్ తో అభిమానులతో కలిసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది.

ఈ విధంగా అభిమానులు ఒకరి తర్వాత ఒకరు తనతో ఫోటోలు తీసుకోవడం కోసం ఎగబడగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ తనతో సెల్ఫీ దిగడం కోసం వచ్చిన అభిమానిని అడ్డుకున్నారు.దీంతో రష్మిక సెక్యూరిటీ గార్డ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని వదలమని చెప్పారు.రష్మిక ఆర్డర్ వేయడంతో సెక్యూరిటీ గార్డ్ చేసేదేమీలేక అభిమానిని వదిలి పెట్టడంతో అతను ఆమెతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.ఈ విధంగా సెక్యూరిటీ గార్డ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అభిమానికి మద్దతు తెలపడంతో ఈమెకు అభిమానుల పట్ల ఏ విధమైనటువంటి గౌరవం ఉందో తెలిసిపోతుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube