శ్రీదేవి నాకు రెండో అమ్మ.. భావోద్వేగానికి గురైన సీనియర్ హీరోయిన్!

ప్రముఖ తెలుగు సినిమా నటీమణులలలో మహేశ్వరి ఒకరనే సంగతి తెలిసిందే.ప్రముఖ నటి శ్రీదేవి అక్క కూతురు అయిన మహేశ్వరి కొన్నేళ్ల పాటు వరుస సినిమా అఫర్లతో ఇండస్ట్రీలో నటిగా బిజీగా ఉన్నారు.

 Actress Maheshwari Comments About Star Actress Sridevi, Maheswari, Shocking Com-TeluguStop.com

అమ్మాయి కాపురం సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి గులాబి, ఖైదీ ఇన్ స్పెక్టర్ సినిమాలతో విజయాలను అందుకున్నారు.పెళ్లి సినిమా మహేశ్వరి సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటని చెప్పవచ్చు.

నీకోసం సినిమాతో మహేశ్వరికి ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.మా అన్నయ్య, తిరుపతి తిరుపతి వెంకటేశ సినిమాల తర్వాత నటిగా మహేశ్వరికి ఆఫర్లు తగ్గాయి.మహేశ్వరి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన మై నేమ్ ఈజ్ మంగతాయారు అనే సీరియల్ లో కూడా నటించారు.శ్రీదేవి పిన్ని కూతురు అయిన మహేశ్వరి శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాజాగా క్యాష్ షోకు హాజరైన మహేశ్వరి సుమ మంచి జోకులు చెబితే టీ ఇస్తానని చెప్పగా నాకు టీ అలవాటు లేదని పంచ్ వేస్తారు.

శ్రీదేవి నాకు రెండో అమ్మ అని మహేశ్వరి షోలో ఎమోషనల్ అయ్యారు.సుమ “కొంతమంది వెళ్లిపోయినప్పుడు వాళ్ల ఫ్యామిలీ మాత్రమే బాధ పడతారు కొంతమంది వెళ్లిపోయినప్పుడు ప్రపంచమంతా బాధ పడుతుంది” అని శ్రీదేవి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

సెప్టెంబర్ నెల 4వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.సదా, శ్రద్ధా దాస్, రాశి కూడా ఈ షోకు హాజరు కాగా శ్రద్ధా దాస్ ఆర్య2 షూటింగ్ సమయంలో తాను ప్రతి చిన్న విషయానికి ఏడ్చేదానినని అందువల్ల తనకు వాటర్ ట్యాప్ అనే పేరు పెట్టారని ఆమె అన్నారు.సదా తాను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటామని ఫ్యాన్స్ చెబుతారని ఆ ప్రశ్న తన లైఫ్ లో ఇబ్బందికరమైన ప్రశ్న అని అని సదా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube