ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తాము సంపాదించిన మొత్తాన్ని రెట్టింపు చేసుకోవడానికి కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు.ముఖ్యంగా తమ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే వెంటవెంటనే భూములను కొంటారు.
తిరిగి మళ్లీ వాటికి మంచి ధరలు వస్తాయన్న ఉద్దేశంతో భూములను కొంటుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు భూములను కొని మంచి పలుకుబడిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది.కానీ ధరలు తగ్గడంతో దారుణమైన అవమానాలు ఎదుర్కొంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి లక్ష్మీకళ్యాణం సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత చందమామ సినిమాలో నటించింది.ఈ సినిమాలు కాజల్ కు మంచి సక్సెస్ ను అందించాయి.ఇక రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకొని ఏకంగా స్టార్ హోదాను సంపాదించుకుంది.
ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది.
గత ఏడాది గౌతమ్ కిచ్లు అనే ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో దారుణమైన అవమానాలు ఎదుర్కొంది.ఇక ఈమె మగధీర సినిమా తర్వాత భూములను కొనుగోలు చేయడానికి బాగా ఆతృత చూపించింది.
ఆ సమయంలో రియల్ ఎస్టేట్ లపై బాగా పెట్టుబడి పెట్టేసింది.

కానీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ధరలు బాగా పడిపోయాయి.దాంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా మారింది.తాను కొన్నప్పుడు ధరలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
కానీ కొంతకాలానికే ధరలు మొత్తం తగ్గిపోయాయి.అయితే కాజల్ కు ఈ విషయం బాగా నిరాశపరిచింది.
ఎంతో కష్టపడి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా ధరలు తగ్గిపోవడంతో తట్టుకోలేక పోయింది.
ఆమె సన్నిహితులు, ఇండస్ట్రీలో కొందరు ఆమెను ఓదార్చకుండా.
ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలం కాలేదు.అప్పుడే ఆశకు నిచ్చెన వేసుకుందని.
ఇప్పుడు రేట్లు పడిపోవడంతో తిక్క బాగా కుదిరింది అని అవమానించారు.దీంతో ఆమె వాళ్ల అవమానాలను అసలు తట్టుకోలేకపోయింది.
తిరిగి మళ్లీ ధరలు అందుబాటులోకి వచ్చాక కాస్త ఊపిరి పీల్చుకుంది.

అలా గతంలో రియల్ ఎస్టేట్ విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కాజల్.కానీ ఇప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న కూడా ఆమె దగ్గర తట్టుకునే శక్తి మాత్రం ఉందని గట్టిగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలో బాగా బిజీగా ఉంది.అంతేకాకుండా త్వరలోనే నాగార్జున నటించనున్న ఓ సినిమాలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది.