ఆ సీనియర్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ వల్లే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు శుక్రవారాలలో ప్రసార మధు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోంది.

 Actress Indraja Asking Controversial Questions To Bullet Bhaskar And Auto Rampra-TeluguStop.com

ఈ జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్ లకు జీవితాన్ని ఇచ్చింది అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.ఎంతో మంది ఆర్టిస్టులు కమెడియన్లు ఈ జబర్దస్త్ స్టేజ్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

చాలామంది ఈ స్టేజ్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై సినిమాలలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నారు.

అందులో హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, అప్పారావు ఇలా ఎంతో మంది కమెడియన్లు వెండితెరపై సినిమాలలో అవకాశం దక్కించుకున్నారు.

ఇకపోతే కొంతమంది సినీమా అవకాశాలతో జబర్దస్త్ షోకీ దూరమవుతున్నారు.ఇంకొందరు ఇతర చానల్లో నుంచి ఆఫర్లు వస్తుండడంతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు.అయితే జబర్దస్త్ నుంచి కమెడియన్లు వెళ్ళిపోతున్న కొద్దీ కొత్త కొత్త కమెడియన్లు జబర్దస్త్ ద్వారా పరిచయము అవుతూనే ఉన్నారు.

కమెడియన్లు పర్మినెంట్ కాదు కామెడీ పర్మినెంట్ అన్న విధంగా జబర్దస్త్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.తాజాగా జబర్దస్త్ ప్రోమో విడుదల అయ్యింది.

ఈ షోకి జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఆ వీడియోలో ఇంద్రజ కమెడియన్లు బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ లను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది.

ఈ సందర్భంగా బుల్లెట్ భాస్కర్ ను ప్రశ్నిస్తూ.మీకో టీం లీడర్ అయిన అప్పారావు ఉండేవారు.

అతన్ని మీరు తొక్కేయడం వల్లనే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై మీ సమాధానం అని ప్రశ్నించగా.

ఆ విషయంపై స్పందించిన బుల్లెట్ భాస్కర్ ఈ విషయం గురించి నేను స్పందించకూడదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నాను అంటే.వెళ్లిపోయిన చాలా పెద్ద ఆయన అంటూ భాస్కర్ సమాధానం చెప్పబోతున్నాడు ఇంతలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ విషయాన్ని కవర్ చేశారు.అనంతరం రాంప్రసాద్ ప్రశ్నిస్తూ మీరు స్క్రిప్ట్ లు సరిగా రాకపోవడం వల్లే మీ టీం మెంబర్స్ అయినా సుడిగాలి సుధీర్, గెటప్ శీను కు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు అంట కదా అందులో నిజమెంత అని అడగగా.

వెంటనే రాంప్రసాద్ ఇంద్ర జాను ప్రశ్నిస్తూ మేడమ్ రోజా గారు మినిస్టర్ కాకూడదని దేవుని మొక్కుకున్నారు అంట కదా ఎందుకు అని అడుగుతాడు? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ప్రోమో ని చూసిన ఆడియన్స్ కేవలం టీఆర్పి కోసమే షో నిర్వాహకులు ఇలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube