నాగార్జునను తిట్టాల్సి రావడంతో వణుకు పుట్టింది.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎన్ కౌంటర్ సినిమాలో మొదట ఛాన్స్ వచ్చిందని తెలిపారు.యాక్సిడెంటల్ గా నాకు ఛాన్స్ దక్కిందని నేనేం ట్రై చేయలేదని ఆయన వెల్లడించారు.

 Actor Manava Koteswararao Comments About Nagarjuna Goes Viral In Social Media ,-TeluguStop.com

ముక్కురాజు మాస్టర్ ద్వారా ఎన్ కౌంటర్ లో ఛాన్స్ దక్కగా ఆ తర్వాత రాములయ్య, యమజాతకుడు సినిమాలో నటించానని ఆయన వెల్లడించారు.

2009లో వేణు అనే వ్యక్తి రైడ్ సినిమాకు పని చేస్తున్నాడని ఆయన ద్వారా రైడ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని మానవ కోటేశ్వరరావు చెప్పుకొచ్చారు.

అప్పటినుంచి మూడు సినిమాలు చేస్తే ఒక సినిమాలో పోలీస్ రోల్ తనకు దక్కుతోందని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తనకు పోలీస్, పొలిటీషియన్ రోల్స్ లో తనకు ఛాన్స్ దక్కిందని ఆయన తెలిపారు.

తాను చిన్న సినిమాలలో విలన్ రోల్స్ లో నటించానని ఆయన వెల్లడించారు.

ఆర్టిస్ట్ అంటే ఏదైనా చేయాలని తనకు ఒకే తరహా పాత్రలు చేయాలని అయితే లేదని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో ఇతర భాషల నుంచి నటులను తీసుకొస్తారని ఆయన వెల్లడించారు.ఇప్పుడు ఇతర భాషల నటులు తెలుగులో నటించడంలో తప్పు లేదని ఆయన తెలిపారు.

తెలుగు వాళ్లకు కూడా ఇతర భాషల్లో ఆఫర్లు వస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

Telugu Nagarjuna, Pan India, Politician-Movie

బాలయ్య సెట్ లో చాలా జోవియల్ గా ఉంటారని ఆయన కామెంట్లు చేశారు.రవిబాబుగారు మనసారా సినిమా విషయంలో సీరియస్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.పర్సనాలిటీ ఎస్వీ రంగారావులా ఉంటే సరిపోదని ఆయన అన్నారని మానవ కోటేశ్వరరావు చెప్పుకొచ్చారు.

నా సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. నాగార్జునతో కేడీ సినిమా చేసే సమయంలో షివరింగ్ వచ్చిందని ఆయనను తిట్టాల్సి రావడంతో భయపడ్డానని భుజంపై చెయ్యి చేసి నాగార్జున డైలాగ్ చెప్పమన్నారని ఆయన తెలిపారు.

మానవ కోటేశ్వరరావు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube