భారతదేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోన్న సంగతి తెలిసిందే.గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలు దాటింది.
అలాగే 4 వేలకు చేరువలో మరణాలు నమోదయ్యాయి.దేశంలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.
ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న కేసులతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు.వీటికి తోడు ఆక్సిజన్, మందులు, వైద్య సామాగ్రి కొరత భారతీయ వైద్య రంగాన్ని ఇబ్బంది పెడుతోంది.
డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం రోగుల్ని రక్షించేందుకు గాను తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అటు కోవిడ్ సెకండ్ వేవ్‌తో కనీవినీ ఎరుగని ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారత్‌ను ఆదుకునేందుకు యావత్ ప్రపంచం ముందుకు వస్తోంది.
ఇప్పటికే 40కి పైగా దేశాలు ఇండియాకు అండగా నిలిచాయి.వీటికి తోడు కార్పోరేట్ దిగ్గజాలు, స్వచ్ఛంద సంస్ధలు సైతం ఏం సాయం చేయడానికైనా సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి.
అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు సైతం మాతృదేశానికి తమ వంతు సాయం చేస్తున్నారు.ఇప్పటికే ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త వినోద్ ఖోస్లా భారీ సాయం అందించన సంగతి తెలిసిందే.
తాజాగా అమెరికాలోని ఎన్ఆర్ఐ వైద్యుల సంఘం ‘‘ఏఏపీఐ ’’ (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) భారత్‌కు సహాయం చేసే విషయమై పలు కార్యక్రమాలను రూపొందించింది.దీనిలో భాగంగా ఏఏపీఐ ప్రతినిధులు అట్లాంటాలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
భారత్‌ను ఎలా ఆదుకోవాలి, సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించాలన్న దానిపై సభ్యులు చర్చించారు.అలాగే కొద్దిరోజుల్లో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపారు.

ప్రస్తుత పరిస్ధితుల్లో రోగులకు నేరుగా వెళ్లి వైద్యం చేయడం సాధ్యం కాదు కాబట్టి.భారత్‌లోని కరోనా రోగులకు టెలీ మెడిసిన్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించారు.ఇప్పటికే ఏఏపీఐ సంస్థ 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లును కొనుగోలు చేసి, వాటిని ‘సేవా ఇంటర్నెషనల్’ ద్వారా భారత్‌లో అవసరమైన వారికి అందజేయాలని కోరింది.అంతేకాకుండా కేవలం వారం రోజుల్లోపే ఏకంగా 2 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించిన ఏఏపీఐ.
సాయం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా అమెరికాలోని భారతీయులను కోరింది.
.