1.ఎల్ఐసీ సేవలు ఐదు రోజులే
ప్రభుత్వ రంగ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి వారానికి 5 రోజులు మాత్రమే పని చేయనుంది అని ఎల్ఐసి ప్రకటించింది.ఇకపై శనివారం ఎల్ఐసి కార్యాలయాలు పనిచేయవు అని ఆ సంస్థ పేర్కొంది.
2.ఈ రోజు రాత్రి ఎస్ బి ఐ డిజిటల్ సేవలు

ఏడో తేదీ శుక్రవారం రాత్రి డిజిటల్ సేవలు పని చేయవు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
3.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,14,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.12 తరువాత సంపూర్ణ లాక్ డౌన్
ఈ నెల 12 తరువాత కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ విదించనున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ ప్రకటించారు.
5.తమిళనాడు సీఎం గా ప్రమాణం చేసిన స్టాలిన్

తమిళనాడు 14వ ముఖ్య మంత్రిగా ముత్తువెళ్ కరుణానిధి స్టాలిన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
6.లాక్ డౌన్ పై కేసీఆర్ క్లారిటీ
తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
7.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.46 మంది మృతి చెందారు.
8.మే నెలాఖరుకు కరోనా తగ్గుముఖం
దేశంలో కరోనా పూర్తి ఈ నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టడం వచ్చని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ గగనదీప్కాంగ్ అన్నారు.
9.భారత్ కు పాక్ ప్రశంస
విదేశాల్లో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయాల కంటే భారత రాయబార కార్యాలయాలే బాగా పనిచేస్తాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కితాబు ఇచ్చారు.
10.ఎద్దు పై పెద్ద పులి దాడి
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని ఓ ఎద్దుపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది.
11.కెసిఆర్ దూషించిన నలుగురి అరెస్ట్

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆస్తులపై విచారణకు ఆదేశించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర పదజాలంతో దూషించిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీసులు అరెస్టు చేశారు.
12.వైయస్సార్ స్టీల్ పరిశ్రమ
రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన ఉక్కు పరిశ్రమను సహకారం చేసే పనుల్లో ఏపీ ప్రభుత్వం కీలక ఘట్టం పూర్తి చేసింది.వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలో సొంతంగా వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ పేరిట నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామి కంపెనీగా ఎస్సార్ స్టీల్ ఎంపికయ్యింది.
13.మే 31 వరకు వివాహాలపై నిషేధం

కరోనా కేసులు కట్టడి కోసం మే 31వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో వివాహాలను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
14.ఆ సింహాలకు వచ్చింది కరోనా కాదు
జూ పార్కులో ఎనిమిది సింహాలకు సంక్రమించిన వైరస్ మానవులకు వచ్చిన కోవిడ్ 19 వైరస్ కాదని ప్రభుత్వ మల్టీస్పెషల్టి పశువైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
15.ఎన్టీవీ చౌదరికి ముందస్తు బెయిల్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ చైర్మన్ నరేంద్ర చౌదరి మరో ఇద్దరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
16.సంగం డెయిరీ స్వాధీనం జీవో రద్దు చేసిన హైకోర్టు

సంగం డెయిరీని తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూసిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదురైంది.దీనికి సంబంధించిన జీవోను హైకోర్టు కొట్టివేసింది.
17.తెలంగాణ ఏపీ పై ఢిల్లీ ఆంక్షలు
ఏపీ తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
18.ఏపీ కి వెళ్లే టీఎస్ ఆర్టీసీ బస్సులు రద్దు
ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి టి ఎస్ ఆర్ టి సి బస్సులను రద్దు చేసినట్లు తెలంగాణ ఆర్టిసి ప్రకటించింది.
19.137 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
తమిళనాడు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో 137 మంది పై క్రిమినల్ కేసులు నమోదవడం చర్చనీయాంశం అయింది.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,300
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,300.