ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి నమోదైన ఓ అరుదైన రికార్డ్ ఏమిటంటే..!

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ( ODI World Cup )2023 టోర్నీలో ఎన్నో ప్రపంచ రికార్డులు బద్దలు అవడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించబడ్డాయి.ఈ టోర్నీలో నమోదైన రికార్డులు గతంలో ఏ టోర్నీలో కూడా నమోదు అయ్యి ఉండకపోవచ్చు.

 A Rare Record For The First Time In The History Of The World Cup Is , England ,-TeluguStop.com

ఈ టోర్నీలో జరుగుతున్న ప్రతి మ్యాచ్లో జట్ల ఆటగాళ్లు రికార్డులను క్రియేట్ చేసి తమ పేరిట లిఖించుకుంటున్నారు.తాజాగా ఇంగ్లాండ్- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో టీం రికార్డులు నమోదు అయ్యాయి.

అవి ఏమిటంటే.ప్రపంచ కప్ చరిత్రలో ఓ ఎడిషన్ లో పాల్గొన్న అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్లు గెలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి కేవలం ఒకే ఒక మ్యాచ్ లో గెలిచి చివరి స్థానంలో ఉండేది.నవంబర్ 8వ తేదీ నెదర్లాండ్ పై విజయం సాధించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.దీంతో ఈ టోర్నీలో ఆడే ప్రతి జట్టు కనీసం రెండు మ్యాచ్లలో గెలిచిన ప్రపంచ రికార్డ్ నమోదయింది.

నెదర్లాండ్స్ జట్టుపై 160 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు పాయింట్ల పట్టికలో పదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి చేరుకుంది.ఈ విజయం ఇంగ్లాండ్ కు ఈ టోర్నీలో ఉపయోగపడదు కానీ 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ అర్హత సాధించేందుకు కీలకం అవ్వనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ( ICC Champions Trophy ) 2025లో అర్హత సాధించాలంటే ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ దశ లో టాప్-7 లో ఉండాల్సి ఉంటుంది.

కాబట్టి ఈ టోర్నీలో సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్న జట్లు కూడా ఛాంపియన్ ట్రోఫీ లో అర్హత సాధించేందుకు తమ తదుపరి మ్యాచ్లలో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube