BJP : రేపు ఏపీ బీజేపీ పదాధికారుల భేటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 50 రోజులలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారు.

 Bjp : రేపు ఏపీ బీజేపీ పదాధికారుల �-TeluguStop.com

ఇప్పటికే పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వైసీపీ… అసెంబ్లీ మరియు పార్లమెంటు ఫైనల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.మరోపక్క టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి కూడా దాదాపు కొన్ని స్థానాలు మినహా సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించేశారు.

ఇప్పుడు పూర్తిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి( BJP Purandeswari ) అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల భేటీ జరగనుంది.

బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ భేటీలో పాల్గొననున్నారు.ముఖ్య అతిథిగా హాజరై.సిద్ధార్థనాథ్ సింగ్( Sidharth Nath Singh ) నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు.పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ పది అసెంబ్లీ స్థానాలలో ఆరు పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తూ ఉంది.తెలుగుదేశం మరియు జనసేన పార్టీ( TDP Janasena )లతో కలిసి పోటీ చేస్తూ ఉండటంతో 2014లో గెలిచినట్లు ఈసారి గెలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మొన్ననే చిలకలూరిపేట( Chilakaluripeta )లో మూడు పార్టీలు కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.ఈ సభకు ప్రధాని మోది ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఇక రానున్న రోజుల్లో ఏపీలో కూటమి తరపున పలువురు కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube