బీజేపీ నేత సీఎం రమేష్( BJP Leader CM Ramesh ) వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల బీజేపీ అధిష్టానం ఏపీలో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం తెలిసిందే.
ఈ జాబితాలో సీఎం రమేష్ అనకాపల్లి నుండి ఎంపీగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ మూర్ఖుడు అంటూ వ్యాఖ్యానించారు.
ఏపీ ప్యాకేజీ డబ్బులు తీసేసుకున్నారని ఆరోపించారు.ఈ సొమ్ముతో జగన్ చాలా స్కామ్ చేశారని.
ఆరోపించారు.చంద్రబాబు అరెస్ట్ నీ బీజేపీ అధిష్టానం ఖండించిందని గుర్తు చేశారు.
బీజేపీ…టీడీపీ.జనసేన( BJP TDP Janasena ) కలయిక రాష్ట్రానికి మంచిదని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.తొలి నుంచి కూడా విశాఖ నుంచి పోటీ చేయాలని భావించాను.కానీ బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు తాను అనకాపల్లిలో పోటీ( Anakapalli ) చేస్తున్నట్లు పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో వైసీపీకి రెండు పార్లమెంటు స్థానాలు మాత్రమే రావచ్చు అని తెలిపారు.
సీఎం జగన్ అండ్ కో( CM YS Jagan ) ఏదైనా మాట్లాడగలరని విమర్శించారు.సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని చంపి నానా రకాలుగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
చెల్లెలి పైన దుష్ప్రచారం చేశారని విమర్శించారు.వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కోవర్టూలేనా అని సీఎం రమేష్ ప్రశ్నించారు.