తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో మాత్రమే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా కూడా హీరోలే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటారు.సినిమాకు తగ్గట్టుగా లుక్ మార్చుకోవడంలో హీరోల ప్రయారిటీ ముందుగా ఉంటుంది.
అయితే ఈ మధ్యకాలంలో సినిమా పోకడ మారుతుంది.తమ పాత్రకు ప్రాధాన్యత లేకపోతే లేదంటే ప్రయోగాలకు తాము సిద్ధం కాకపోతే జనాలు యాక్సెప్ట్ చేయరు అని అర్థం చేసుకున్నారో ఏమో హీరోయిన్స్ కూడా ప్రయోగాలకు అడ్రస్ గా మారుతున్నారు.
ఈ దోవలో ప్రముఖ స్టార్ హీరోయిన్స్ వచ్చి చేరుతున్నారు.మరి గ్లామర్ ఇమేజ్ కి దూరంగా డీ గ్లామర్ రోల్( De Glamor Roles ) లో నటించడానికి కూడా సిద్ధమై పోతున్న ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్థికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రష్మిక మందన( Rashmika Mandanna ) చాలా రోజులుగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తూ వస్తుంది.ఇటీవల ఆనిమల్ సినిమా ద్వారా ఆమె నేషనల్ వైడ్ గా చాలా పాపులర్ అయింది.పుష్ప సినిమాతో డి గ్లామర్ రోల్ లో కూడా నటించింది.ఈ సినిమా విజయం సాధించగా ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) లో ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర చాలా ప్రభావితంగా ఉండబోతుందట.
మాస్ లుక్ కోసం బాగా తహతలాడుతున్న రష్మిక ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న విషయాన్ని పక్కన పెట్టింది.
ఈ దారి లోనే దేవర సినిమా( Devara )తో దున్నేయడానికి వస్తోంది జాన్వి కపూర్( Janhvi Kapoor ). ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సరసన నటిస్తున్న సినిమాలో సైతం పీరియాడికల్ డ్రామా ఉండబోతుందట అందుకని మాస్ లుక్ లోనే కనిపించబోతుందట.మొత్తానికి సౌత్ లో ఒప్పుకున్న రెండు సినిమాలు డి గ్లామర్ రోల్స్ కావడం విశేషం
ఇక మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) సైతం తానేమి తక్కువ తినలేదు అన్నట్టుగా గ్లామర్ రోల్స్ తో పాటు డి గ్లామర్ పాత్రలను కూడా ఒప్పుకుంటుంది మరోవైపు వింటేజ్ సినిమాల్లో కూడా నటిస్తోంది.ఈ మధ్యన నటించిన దసరా సినిమా( Dasara )లో ఆమె ఏ మేరకు తన మాస్ లుక్స్ తో ప్రేక్షకులను మెప్పించిందో మనందరికీ తెలుసు.
కల్కి సినిమాతో దీపిక పడుకునే( Deepika Padukone )కూడా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కల్కి సినిమా( Kalki Movie ) టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి రకరకాల పాత్రధారణలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నారట.