ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది.ఇక కేవలం మూడు మ్యాచ్లలో ఈ సంవత్సరం విజేత ఎవరు తెలనున్నారు.
సీజన్ మొదట్లో రాయల్ చాలెంజ్ బెంగళూరు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ తర్వాత గ్రేట్ కం బ్యాక్ ఇచ్చి వరుసగా ఆరు విజయాలతో ఏకంగా ప్లే ఆప్స్ లో స్థానాన్ని సంపాదించింది.ఈ ప్రయాణంలో ఆర్సిబి ఆటగాడు కింగ్ కోహ్లీ(King Kohli) ప్రధాన పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ సీజన్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పటికే 700 పరుగులను పూర్తి చేశాడు.ఇక ప్లే అఫ్స్ బెర్త్ కోసం జరిగిన చివరి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును ఏకంగా 27 అడుగుల తేడాతో ఓడించి భారీ విజయనందుకొని చివరకు ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీ వీరాభిమాని ఓ కళాకారుడు తన రక్తంతో ఏకంగా చిత్రపటాన్ని గీసి ప్రేమ్ కట్టించాడు. కర్ణాటక (Karnataka)రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లా మహాలింగాపురానికి చెందిన శివానంద నీల్ నూర్ అనే వ్యక్తి విరాట్ కోహ్లీ (Virat Kohli)చిత్రాన్ని తన రక్తంతో అందంగా గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగ అది కాస్త వైరల్ గా మారింది.ఈ ఫోటోలను చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు నువ్వు నిజమైన అభిమానివి అంటూ అతనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.2008 సంవత్సరం నుండి శివానంద ఆర్సిబికి వీర అభిమానిగా మారాడు.ఇకపోతే తాజాగా మహాలింగాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆర్ట్ టీచరుగా అతను విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శివలింగ మాట్లాడుతూ నా పెయింటింగ్ అందరూ అభినందిస్తున్నారు.
ఇది విరాట్ కోహ్లీ కూడా చూడాలని భావిస్తున్నట్లు ఆయన తన మనసులోని కోరికను బయట పెట్టడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
.