ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు రెండు లక్ష్యాలను సాధించడానికి వేర్వేరు రివార్డ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తాయి.పని సామర్థ్యాన్ని మెరుగుపరచడం, కంపెనీకి లాభాలను పెంచడం ఒక లక్ష్యం అయితే, ఇంకో లక్ష్యం, ఉద్యోగులకు వారి రెగ్యులర్ శాలరీలకు మించి ఎక్స్‌ట్రా మనీ సంపాదించడానికి అవకాశం ఇవ్వడం.
ఈ అవకాశం వల్ల వారిని అత్యుత్తమ పనిని గుర్తించినట్లు కంపెనీలు చెప్పకనే చెబుతాయి.అయితే కొన్ని కంపెనీలు ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకువెళ్లాయి.
ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా వారి శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించే రివార్డ్ సిస్టమ్‌లను కూడా రూపొందించాయి.
గ్వాంగ్‌డాంగ్ డాంగ్‌పో పేపర్( Guangdong Dongpo Paper ) అనే చైనీస్ కంపెనీ దీనికి ఒక మంచి ఉదాహరణ.
ఈ సంస్థ తన ఉద్యోగులకు ప్రతి నెలా ఎంత శారీరక వ్యాయామం చేస్తారో దాని ఆధారంగా ఎక్కువ డబ్బు చెల్లిస్తుంది.ఈ ఫిట్‌నెస్-ప్రోత్సాహక కార్యక్రమం( A fitness-promoting program ) కొంత చర్చకు కారణమైంది.
ఇది ఉద్యోగుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు, ఇది అన్యాయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒక ఉద్యోగి నెలకు 50 కి.మీ పరిగెత్తితే ఫుల్ మంత్లీ బోనస్, 40 కి.మీ పరిగెత్తితే బోనస్‌లో 60 శాతం, 30 కిమీ పరుగుకు బోనస్‌లో 30 శాతం పొందవచ్చని సదర్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.ఒక ఉద్యోగి నెలకు 100 కిలోమీటర్లు పరిగెత్తినట్లయితే, వారు పూర్తి బోనస్‌పై అదనంగా 30 శాతం పొందవచ్చని కూడా తెలిపింది.

మౌంటెన్ హైకింగ్, స్పీడ్ వాకింగ్ ( Mountain hiking, speed walking )వంటి ఇతర రకాల వ్యాయామాలను కూడా పాలసీ లెక్కిస్తుంది.అవసరమైన మొత్తం వ్యాయామంలో ఇవి వరుసగా 60, 30 శాతం వరకు ఉంటాయి.ఉద్యోగులు వారు కవర్ చేసే దూరాన్ని కొలవడానికి వారి ఫోన్‌లలో యాప్‌లను ఉపయోగిస్తారు.
కంపెనీ బాస్ లిన్ జియోంగ్ మాట్లాడుతూ ఒక కంపెనీ దాని ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా కాలం పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.అయితే ఈ కంపెనీ ఆలోచనలు చాలామంది పొగుడుతున్నారు.
ఇలాంటి రివార్డ్ సిస్టమ్ తమ కంపెనీలు కూడా తీసుకొస్తే బాగుంటుందని అంటున్నారు.