పిల్లలు చేసే అల్లరి చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోష పడిపోతుంటారు.కానీ ఈ అల్లరి శృతిమించితే తల్లిదండ్రులకు తిప్పలు తప్పవు.
ఇంట్లో అల్లరి చేసినా పర్వాలేదు కానీ బయట ప్రదేశాల్లో అల్లరి చేస్తే మరింత ఇబ్బంది.ఒక్కోసారి ఈ చిన్న పిల్లలు చేసే అల్లరి వల్ల తల్లిదండ్రులు చిక్కుల్లో పడిపోతుంటారు.
వీరి అల్లరి కారణంగా తల్లిదండ్రులు ఒక్కోసారి ఆర్ధిక నష్టం కూడా భరించాల్సి వస్తుంది.తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఒక చిన్న పిల్లాడి అల్లరి వల్ల తండ్రి రూ.3.30 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.ఇంతకీ ఆ పిల్లోడు చేసిన ఖరీదైన చిలిపి పని ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హాంకాంగ్‌కు చెందిన చెంగ్ అనే ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులను తీసుకొని లాంగ్‌హామ్‌లోని షాపింగ్ మాల్‌లోని కేకే ప్లస్‌కు వెళ్ళాడు.అయితే షాపింగ్ లో పడింది బిజీ అయిపోయిన ఈ దంపతులు తమ పిల్లలపై పెద్ద పెట్టలేదు.ఇదే సమయంలో వీరి పిల్లోడు 1.8 మీటర్ల గోల్డెన్ కలర్ టెలీటబ్బీస్ బొమ్మను కింద పడేశాడు.దీంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.ఆ శబ్దం ఏంటా అని చూడగా బొమ్మలతో పాటు దాని చెయ్యి కూడా విరిగిపోయి కనిపించింది.దాని పక్కనే పిల్లోడు షాకై చూస్తుండిపోయాడు.ఆలోగా హుటాహుటిన శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పిల్లాడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ బొమ్మను మీ సుపుత్రుడే తన్ని పగలగొట్టాడని.దీని ఖరీదు రూ.3.30 లక్షలని.అంత మొత్తం చెల్లించాల్సిందే అన్ని షాప్ సిబ్బంది తల్లిదండ్రులపై అరిచారు దీంతో చేసేదేమీ లేక అంత మొత్తంలో డబ్బు జరిమానాగా కట్టేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.అందుకే విలువైన వస్తువులు ఉన్నచోటికి వెళ్ళినప్పుడు పిల్లలపై ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది.