చైతూ వాల్యూ ‘అఖిల్‌’ విడుదల తర్వాత తెలుస్తోంది!!

అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున వారసులుగా ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్‌లు ఎంట్రీ ఇచ్చాడు.అఖిల్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, నాగచైతన్య చాలా సంవత్సరాల క్రితమే వచ్చాడు.

 Naga Chaitanya Acting Is Better Than Akhil..?-TeluguStop.com

‘జోష్‌’ చిత్రంతో నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతో ఫ్లాప్‌ అయ్యాడు.

ఆ తర్వాత కూడా చైతూ సక్సెస్‌ హీరోగా పేరు తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు, ఇప్పటికి పడుతూనే ఉన్నాడు.చైతూకు నటన రాదు అని కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ సమయంలో వచ్చిన ‘అఖిల్‌’ చిత్రం నాగచైతన్య విలువ తెలిపిందని అక్కినేని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

‘అఖిల్‌’ విడుదల సందర్బంగా అఖిల్‌ నటన గురించి ట్విట్టర్‌లో ఘాటు, ఫనీ కామెంట్స్‌ వచ్చాయి.

అఖిల్‌ నటన చూసిన తర్వాత చైతూ నటన చాలా నయం అని, ఇన్నాళ్లు చైతూ విలువ తక్కువగా ఉందని, ఇప్పుడు అఖిల్‌ రావడం వల్ల చైతూ విలువ పెరిగిందంటూ ఫన్నీ కామెంట్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ అవుతున్నాయి.ఇదే స్థాయిలో నాగచైతన్యను ప్రమోట్‌ చేసి ఉంటే తప్పకుండా ఇప్పుడు మెగా హీరోలకు ధీటుగా నిలిచేవాడని, ఇప్పుడు అఖిల్‌కు ఇంత ప్రచారం ఇచ్చినా కూడా వృధా అని కొందరు అంటున్నారు.

మొత్తానికి అఖిల్‌పై విమర్శల వర్షంను ఒక వర్గం ప్రేక్షకులు ట్విట్టర్‌లో కురిపిస్తున్నారు.ఇక చైతూ ప్రస్తుతం ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube