ఆన్‌లైన్‌లో అప్పుడే ‘బ్రూస్‌లీ’ సీన్స్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘బ్రూస్‌లీ’.నిన్న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.

 Chiru’s Scene In Bruce Lee Movie Leaked Online-TeluguStop.com

శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత దానయ్య నిర్మించాడు.ఈ చిత్రంలో మెగాస్టార్‌ చిరంజీవి గెస్ట్‌ రోల్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

గత కొంత కాలంగా సినిమాకు పెద్ద సమస్యగా మారిన పైరసీ అప్పుడు ‘బ్రూస్‌లీ’ని సైతం పట్టింది.

నిన్న సాయంత్రం నుండే ‘బ్రూస్‌లీ’ చిత్రంలోని చిరంజీవి కనిపించే ఎపిసోడ్‌ అంతా ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తూ వస్తోంది.

సోషల్‌ మీడియాలో చిరు వీడియో పెద్ద ఎత్తున షేర్‌ అవుతూ ఉంది.దాంతో చిత్ర యూనిట్‌ జాగ్రత్త పడి ఆ వీడియోను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమాకు ప్రధాన ఆకర్షణ అయిన చిరంజీవి సీన్‌ మొత్తం లీక్‌ అవ్వడం సినిమాకు పెద్ద నష్టం అని సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని చిత్ర యూనిట్‌ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.

ఈ చిత్రం మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ రాబట్టి దుమ్ము రేపింది.దసరా సెలవులు ఈ చిత్రానికి బాగా కలిసి వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube