పవర్ చూపడమంటే కరెంట్ చూపించడమో లేదా అధికారం చూపించడమో కాదు.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం.
ఇది కొత్త విషయం కాదు కదా … ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొత్త కాదు కాని దాన్ని అసెంబ్లీలో చేయడమే కొత్త.ఈ కొత్తదనం తెలంగాణా సీఎమ్ కెసీఆర్ చూపించాబోతున్నారు.
ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇలాంటి ఫీట్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిట్ట.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఘనతను వివరిస్తుంటారు.ఇప్పుడు ఈ ఆలోచన కెసీఆర్ కు కలిగింది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అసెంబ్లీలో నాలుగు పెద్ద తెరలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి పారుదల ప్రాజెక్టుల డిజైన్ల మార్పు గురించి శాసన సభ్యులకు వివరిస్తారట.
ప్రాజెక్టుల రీడిజైనింగ్ మీద ప్రతిపక్షాలు సర్కారును విమర్శిస్తున్నాయి.ఆందోళనలు చేస్తున్నాయి.
కానీ ఆరు నూరైనా డిజైన్లు మారుస్తామని కెసీఆర్ పట్టు పడుతున్నారు.తను చెప్పేది శాసన సభ్యులకు అర్ధం కావడం లేదని ఆయన అభిప్రాయం కావొచ్చు.
అందుకే అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించారు.కెసీఅర్ కూడా టెక్నాలజీని ఉపయోగించుకునే దిశగా ప్రయాణిస్తున్నారు.