కేంద్రంలో టీడీపీ తరపున మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీ చాలా పెద్ద మనసుతో ఎపీకి సహాయం చేస్తున్నారని చెప్పుకుంటూ సంబర పడుతున్నారు.కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధులు చూసుకొనే ఎంతో సాయం చేసినట్లు ఫీల్ అవుతున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 1,850 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.కొత్తగా ఏర్పాటైన మూడు రాష్ట్రాలకు కలిపి కేంద్రం 1,500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేసే తత్త్వం, అంకిత భావం చూసి కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇస్తుందని సుజనా అన్నారు.పోలవరం ప్రాజెక్టుకు 400 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఎంతగానో ఆడుకోవలసిన మోడీ సర్కారు కొద్ది నిధులు ఇవ్వగానే సంబర పడిపోయే గతి టీడీపీ సర్కారుకు పట్టింది.కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేస్తుందనే నమ్మకం బాబు ప్రభుత్వానికి ఉంది.
అందుకే కొద్ది సహాయమైనా దాన్నే మహా ప్రసాదంగా భావిస్తున్నది.