మహేష్, ఎన్టీఆర్ చేస్తున్నారు ... పవనే మిగిలింది

సామాజిక అనుసంధాన వెబ్ సైట్స్ ని సెలబ్రిటీస్ ఎందుకు వాడతారు ? ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండటానికి … రాను రాను సినిమాలు ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు .మన తెలుగు విషయానికొస్తే మహేష్ బాబు ట్విట్టర్ లో సినిమా ప్రచారం చేయడాన్ని మొదలుపెట్టాడు .

 Mahesh,ntr Promotions On Twitter, Pawan Yet To Start-TeluguStop.com

ఆ తరువాత చాలా మంది యువ హీరోలు అనుసరించారు.

అగ్ర హీరోల విషయానికొస్తే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పెద్దగా సినిమాల గురించి ట్విట్టర్ లోకి తీసుకొని రారు.

వాస్తవానికి వారు ట్విట్టర్ వాడేదే తక్కువ.ఇంకా చెప్పాలంటే, కొన్ని సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ట్విట్ చేయడమే మానేసాడు.

అలాంటిది, ఇప్పుడు నాన్నకు ప్రేమకోసం యూనిట్ ఎన్టీఆర్ ను మార్చేసింది.ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ లో కుడా సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి.

ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ ఒక్కడే .కాని మన పవర్ స్టార్ రూటే వేరు… రాజకీయాలు, సమాజం తప్ప సినిమాల గురించి ఒక్క ట్వీట్ చేయలేదు పవన్ ఇంతవరకు.సర్దార్ గబ్బర్ సింగ్ పోస్టర్ కుడా నిర్మాత, దర్శకుడు పోస్ట్ చేసారు తప్ప పవన్ దాని ఊసు కూడా ఎత్తలేదు.మరి మన పవర్ స్టార్ ఎప్పుడు ప్రమోషన్స్ మొదలుపెడతాడు ? పవన్ ని మార్చేదెవరు ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube