లడ్డూ తయారీ కేంద్రం తనిఖీ చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం తనిఖీ చేశారు.మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Government Whip, District Collector Inspect Laddu Manufacturing Facility, Laddu-TeluguStop.com

ఈ సందర్బంగా వారిని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువాలతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేయగా, అర్చకులు ఆశీర్వచనం చేశారు.

అనంతరం విప్, కలెక్టర్ తదితరులు లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించారు.

స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు.రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు, ఎన్ని లడ్డూలు రోజు సిద్ధం చేస్తారు? ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారో ఆరా తీశారు.లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube