అప్పుడు చెప్పను బ్రదర్.. ఇప్పుడు థాంక్యూ బాబాయ్.. పవన్ ఫ్యాన్స్ కూల్ అయినట్టేనా?

గత కొంతకాలంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.మీడియాలో కూడా గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ పై( Allu Arjun ) దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

 Did Pawan Kalyan Fans Cooled On Allu Arjun Comments Details, Pawan Kalyan, Allu-TeluguStop.com

దీంతోమెగా బ్రాండ్ వదిలి సొంతంగా అల్లు ఆర్మీ ని సిద్ధం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్.దీంతో ఈ విషయం పట్ల అభిమానులు ఆగ్రహానికి లోనవుతున్నారు.

ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి‌కి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన కామెంట్స్ అల్లు అర్జున్‌ని పూర్తిగా మెగా బ్రాండ్‌కి దూరం చేశాయి.ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పోటీలో ఉండగా ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంపై అనేక మాటలను బన్నీ ఎదుర్కొవాల్సి వచ్చింది.

Telugu Allu Arjun, Alluarjun, Allu, Fans Allu Fans, Pawan Kalyan, Pushpa, Pushpa

అయితే అప్పటి నుండి మెగా వేరు, అల్లు వేరు అనేలా ఇండస్ట్రీలో సైతం మార్పు కనిపిస్తూ వస్తుంది.అయితే ఇది ఇప్పటిది కాదు.గత కొంత కాలంగా నుండే జరుగుతూ వస్తుంది.ఆ మధ్య ఒక మూవీ ఫంక్షన్‌ లో మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగగా.చెప్పను బ్రదర్ అంటూ బన్నీ ఫ్యాన్స్‌ కి క్లాస్ ఇచ్చాడు.అప్పటి నుండి అల్లు అర్జున్‌లో ఛేంజ్ కనిపిస్తూ వస్తుంది.

తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, మెగా బ్రాండ్‌ని.మెగాభిమానులని బాధపెడితేనే తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పడుతుందని భావించినట్లుగా ఉన్నాడు.

అప్పటి నుండి బన్నీ వేసిన ప్రతి అడుగు మెగాకు ఆయన దూరం అవ్వాలనే చేసినట్లుగా అనిపిస్తూ వస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Allu, Fans Allu Fans, Pawan Kalyan, Pushpa, Pushpa

దీనిపై అల్లు అర్జున్ పలు విమర్శలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వర్స్‌ కి దారి తీస్తుండటంతో పాటు, సినిమాలో డైలాగ్ లేకపోయినా బాస్ పేరుతో మెగా ఫ్యామిలీని( Mega Family ) ఫ్యాన్స్ అవమానకరంగా మాట్లాడుతూ కొందరు అల్లు అర్జున్, వైసీపీ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ వార్స్ మరింత పెరుగుతూ తారా స్థాయికి చేరింది.మరి ఈ విషయం గమనించాడో లేదంటే తను అంత చేసినా సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం చూసి కరిగిపోయాడో తెలియదు కానీ ఫైనల్లీ అల్లు అర్జున్‌ మారిపోయారని అందరు అనుకున్నారు.

కానీ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్‌ లో కళ్యాణ్ బాబాయ్ అంటూ. మరోసారి పాత అల్లు అర్జున్‌ ని గుర్తు చేశారు.

టిక్కెట్ల ధరలను( Ticket Rates ) పెంచుకునేలా జీవో రావడానికి ప్రధానకారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ.నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్‌ కి థ్యాంక్యూ.

హార్ట్‌ ని టచ్ చేశారు అని అల్లు అర్జున్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతున్న వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

దీనికి మెగా ఫ్యాన్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ.మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube