యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగుడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్ సృష్టించాడు.గ్రామంలోని ప్రధాన రహదారిపై (పాత సెంట్రల్ బ్యాంక్ స్థలం) ఎస్ఎల్ఎన్ఎస్ మెడికల్స్ జనరల్ షాప్ పక్కన చాడ గ్రామానికి చెందిన మల్గ ఐలయ్య ఇంటిలోకి గుర్తు తెలియని వ్యక్తి రాత్రి 9 గంటల సమయంలో ప్రవేశించాడు.
అక్కడే కొద్ది సేపు నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా పక్కన ఇంటిలో ఉన్న స్థానికురాలు తమ ఇంటిపై నుండి గమనించి అరుస్తూ క్రిందకి వచ్చి పక్కన ఉన్న మెడికల్ షాప్ అతనితో కలిసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా వెంటనే తేరుకున్న దుండగుడు ఇంటి వెనకాల గోడ ఎక్కి గోడపై నుండి పరిగెత్తుతూ పక్కనే ఉన్న కాలనీలో ప్రవేశించి తప్పించుకున్నాడు.
వెంటనే అప్రమతమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి,స్థానికులతో కలిసి సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
గత కొద్దిరోజుల నుండి ఘటన జరిగిన ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఇల్లు తాళం వేసి ఉంది,కనీసం విద్యుత్ లైట్లు కూడా వెలగడం లేదు.దుండగుడు ఘటన జరిగిన ఇంట్లో ఒక జత చెప్పులు,అంబర్ ప్యాకెట్ వదిలివెళ్ళాడు.
ఈ ఘటన దాదాపుగా శనివారం రాత్రి 9:20 నుండి 10 :00 గంటల మధ్యలో జరగడంతో దుండగుడి ఉద్ధేశ్యం దొంగతనమా లేక మరేదైనా ఉందా అనే అంశాలు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.ఈ ఘటనతో ఒక్క సారిగా గ్రామ ప్రజలు ఉలిక్కి పడ్డారు.
సాధారణంగా ఘటన జరిగిన పరిసర ప్రాంతంలో రాత్రి పది గంటల వరకు కూడా జనాల తీరుతూ ఉంటారు.
ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలు కూడా ఉంటాయి.
ఘటన జరిగిన సమయానికి కొద్దిగా అటు ఇటు సమయంలో వర్షం రావడం.కొద్ది సేపు కరెంట్ పోవడంతో దుండగుడు అదే అదునుగా భావించి ఇంటిలోకి ప్రవేశించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఈ ఘటనలో నగదు,ఎలాంటి విలువైన వస్తువులు చోరికి గురి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.స్థానికుల వివరాల ప్రకారం దుండగుడు నల్లటి రంగు చొక్కా ధరించి 5 నుండి 6 అడుగుల ఎత్తు ఉన్నాడని సమాచారం.