దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!

టాలీవుడ్ హీరో జునియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర.( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Devara Part1 Global Domination, Devara, Devara Movie, Jr Ntr, Devara Domination,-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.కాగా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.

నెట్‌ ఫ్లిక్స్‌ లో( Netflix ) గత నాలుగు వారాలుగా ఈ సినిమా టాప్‌లో ట్రెండ్‌ అవుతూనే ఉంది.మరోసారి టాప్‌ లో ఉన్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Telugu Allu Arjun, Devara, Devara Ott, Jahnvi Kapoor, Jr Ntr, Jr Ntr Devara, Kor

దేవర సినిమా వరుసగా 4వ వారం ట్రెండ్‌ అవుతోంది అంటూ యూనిట్‌ సభ్యులు అధికారికంగా వెళ్లడించారు.2.8 మిలియన్‌ ల వ్యూస్‌ తో 8.1 మిలియన్‌ ల వాచ్‌ అవర్స్‌ తో దేవర ఆధిపత్యం కొనసాగుతోంది అంటూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా సోషల్‌ మీడియా వేదికగా ఫోటోలను షేర్‌ చేసింది.ఏడు దేశాల్లో దేవర సినిమా టాప్‌ 10 ప్లేస్‌ల్లో కొనసాగుతోంది.ఆఫ్రికాలోని ఒక దేశంతో పాటు ఆసియాలో ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవ్స్‌, శ్రీలంక, యూఏఈ లో ఈ సినిమా ట్రెండ్‌ అవుతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు ఫాన్స్.

Telugu Allu Arjun, Devara, Devara Ott, Jahnvi Kapoor, Jr Ntr, Jr Ntr Devara, Kor

ఒకవైపు అల్లు అర్జున్( Allu Arjun ) నటిస్తున్న సినిమా విడుదల అవుతున్న సమయంలో కూడా దేవర సినిమా లీడర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో పాటు అక్కడ దేవర హవా నడుస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.ఇలాంటి సమయంలో కూడా కొన్ని దేశాలలో అలాగే ఓటీటీ లో కూడా దేవర హవా కనిపిస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube