టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.పాన్ ఇండియా మూవీగా 70 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో చందూ మొండేటి( Chandoo Mondeti ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా నాగచైతన్య ఈ సినిమా కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుత్తున్నాయి.

తండేల్ సినిమాలోని రోల్ కోసం తాను 9 నెలల పాటు కష్టపడ్డానని నాగచైతన్య( Naga Chaitanya ) అన్నారు.పాక్ జలాల్లోకి వెళ్లి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చిన రాజు అనే పాత్ర కథే తండేల్ అని నాగచైతన్య వెల్లడించారు.తండేల్ మూవీ( Thandel ) స్పూర్తిదాయకమైన కథ అని ఈ సినిమాలో నేను ప్రతిదీ సరిగ్గా ఉండాలని కోరుకుంటానని నాగచైతన్య కామెంట్లు చేయడం గమనార్హం.

శ్రీకాకుళం యాస విషయంలో ప్రధానంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని చైతన్య అన్నారు.నేను రాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లానని ఆ వ్యక్తి ధైర్యం, సంకల్పం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయని చైతన్య పేర్కొన్నారు.మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవడానికి నేను వారితో సమయం గడిపానని చైతన్య అన్నారు.ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసున్నట్టు తెలుస్తోంది.
తండేల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని ఈ సినిమా మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.తండేల్ మూవీ వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.సాయిపల్లవి ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.