ఏడాది కాలంలో ఒకే ఒకసారి వచ్చే పుట్టిన రోజు వేడుకలను( Birthday Celebrations ) చాలామంది జరుపుకుంటూ ఉంటారు.ముఖ్యంగా ఇంట్లోని పిల్లల విషయంలో పుట్టినరోజు వేడుకలను వారికి తాహతు తగ్గట్టుగా బంధుమిత్రులందరిని పిలుచుకొని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును( Mother Birthday ) ప్రత్యేకంగా జరిపించాలన్న ఉద్దేశంతో విమాన సిబ్బంది సహాయం తీసుకుని తన తల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా పుట్టినరోజు శుభాకాంక్షలని తెలిపాడు.ప్రస్తుతం ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఓ తల్లికొడుకులు ఇద్దరూ విమాన ప్రయాణం చేస్తున్నారు.నిజానికి అన్ని విమాన సంస్థలు ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా నడుచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయి.ఇందులో భాగంగానే ఓ బాలుడు అడిగిన విజ్ఞప్తికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్( Air India Express ) విమాన సిబ్బంది అతనికి సహకరించింది.ఆ పిల్లోడు ఫ్లైట్ లోని సిబ్బంది దగ్గరకు వెళ్లి ఈరోజు తన తల్లి పుట్టినరోజుని ఎలాగైనా తన పుట్టినరోజును ఫ్లైట్ లో అనౌన్స్ చేసి ఆమెకు విషెస్ తెలపాలంటూ కోరాడు.
దాంతో అతనికి విమాన సిబ్బంది సహకరించి ఓ ప్రత్యేకమైన అనౌన్స్ చేయడమే కాకుండా ఆమెకి విషెస్ తెలుపుతూ చేతితో రాసిన ఓ నోట్ లెటర్ ని కూడా ఆమెకు అందించారు.
వీటితోపాటు పుట్టినరోజు జరుపుకుంటున్న అమ్మకి ఓ ప్రత్యేకమైన ట్రీట్ ను కూడా అందించింది విమానా సిబ్బంది.దీంతో ఆ తల్లి( Mother ) ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది.ఈ విమానంలో ఆమెకు వారితో పాటు ప్రయాణం చేస్తున్న ఇతర ప్రయాణికుల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చాయి.
ప్రస్తుతం ఈ విషయం సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోని చూసిన వారు అబ్బాయి ఆలోచన విధానం అమోఘం అంటూ మెచ్చుకుంటున్నారు.
మరికొందరైతే ఇలాంటి అబ్బాయి ఉండడం ఆ తల్లి అదృష్టం అంటూ పొగడ్తలతో కామెంట్ చేస్తున్నారు.