కరీంనగర్ కదనబేరి సభలో మాజీ సీఎం కేసీఆర్ ( KCR )కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.మంచినీటి.
సాగునీటి సరఫరాల్లో కరెంటు అందించడంలో ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లల్లో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు.
ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే బీఆర్ఎస్ పార్టీ( BRS party )ప్రజల పక్షాన అంత బలంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.పంటలకు నీళ్లు లేక రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు ఎండుతున్న పాలకులకు దయ రావట్లేదు.మూడు నెలలలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు.ఈ పాలన చూస్తుంటే సమైక్యపాలనే నయం అనిపిస్తుంది.తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు.మొన్న నేను గెలిచి ఉంటే దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి… అందరినీ చైతన్యం చేసేవాణ్ణి… అని వ్యాఖ్యానించారు.ఇదే సభలో పోలీసులను హెచ్చరించారు.
తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయొద్దని హెచ్చరించారు.పోలీసులకు రాజకీయాలు ఎందుకండీ.? ఎవరికి అధికారం శాశ్వతం కాదు.మేం పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నాం.
కానీ ఎటువంటి దౌర్జన్యాలు చేయలేదు.మేము కనుక చేయించి ఉంటే కాంగ్రెస్ ( Congress )వాళ్లు ఒకరైన రాష్ట్రంలో మిగిలి ఉండేవారా.? అంటూ కేసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.