తాజాగా ఓ 12 ఏళ్ల పిల్లోడు వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఆ పిల్లోడు స్పందించిన తీరు చూసి నెటిజన్స్ ప్రస్తుతం ఆ పిల్లాడికి హాట్సాఫ్ చెబుతున్నారు.
ఇందుకు సంబంధించిన సంఘటన మహారాష్ట్రలోని( Maharashtra ) నాసిక్ మాలేగావ్ ప్రాంతంలో జరిగింది.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
మోహిత్ అహిరే( Mohit Ahire ) అని 12 ఏళ్ల బాలుడు తన ఇంట్లో గదిలో ఫోన్ లో వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో హఠాత్తుగా ఇంట్లోకి పులి ప్రవేశించింది.
ఇలా జరిగిన సమయంలో ఆ అబ్బాయి ఎలాంటి భయానికి లోనవ్వకుండా.అలాగే ఉండి పులి లోపలికి వెళ్ళగానే అతడు చాకిచెక్యంగా వ్యవహరించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఇంటి తలపు( Door ) బయట నుంచి మూసేశాడు.దాంతో పులి ఇంట్లోనే బందీగా మారిపోయింది.
పరిస్థితి ఇలా ఉన్న సమయంలో ఆ అబ్బాయి ఇంటి ఇరుగుపొరుగు వారిని పిలిచి అసలు విషయం తెలిపాడు.దాంతో ఇరుగుపొరుగు వారు ఆ ప్రాంతంలోని అటవీ శాఖ అధికారులకు( Forest Officers ) సంఘటన తెలపగా.,
వెంటనే అధికారులు స్పందించి చిరుత పులికి( Leopard ) మత్తుమందు ఇచ్చి దానిని బంధించారు.సంఘటన జరిగిన ప్రాంతం నది ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో అప్పుడప్పుడు పులులు నది దగ్గరికి రావడంతో ఇలాంటి సంఘటన ఏర్పడిందని అటవి శాఖ అధికారులు తెలియజేశారు.మోహిత్ చాకిచెక్కంగా తనను కాపాడుకోవడం మాత్రమే కాకుండా., పులి ప్రాణాలు కూడా కాపాడినందుకు నెటిజెన్స్ అతడి ధైర్యసహసాలకు ప్రశంసలతో ముంచేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.