ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు( Governor Abdul Nazeer ) టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) లేఖ రాశారు.టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని ఆయన లేఖలో ఆరోపించారు.
వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు.
మాజీ మంత్రి పుల్లారావు( Prathipati Pullarao ) కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీ ఎస్ఆర్డీఐ దుర్వినియోగాన్ని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో గవర్నర్ నజీర్ ను కోరారు.