ఏపీలో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా ఉంది.ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో ప్రజల వద్దకు వెళుతూ ఉన్నాయి.2024 ఎన్నికలను వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2024 ఎన్నికలలో 175 కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.ఆ దిశగానే జగన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలో పార్టీ నేతలను కేడర్ నీ ఏకతాటి పైకి తీసుకొస్తూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మంగళవారం మంగళగిరిలో “మేము సిద్ధం- మా బూత్ సిద్ధం” అనే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి నాయకులు( Booth level leaders ) కీలక నేతలు హాజరయ్యారు.ఎట్టి పరిస్థితులలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో గెలవాలని జగన్ ప్రసంగించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే రేపు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి భీమవరంకి సీఎం జగన్( CM Jagan ) పర్యటన చేయబోతున్నారట.
భీమవరం పెద్దఅమిరంలోనీ రాధాకృష్ణ కన్వెన్షన్ కి చేరుకుని గుణ్ణం నరసింహా నాగేంద్రరావు, రాజరాజేశ్వరి ( Narasimha Nagendra Rao, Rajarajeshwari ) దంపతుల కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా పర్యవేక్షణలు మొత్తం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఇదే సమయంలో భీమవరం పరిసర ప్రాంతంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి భారీగా హాజరు కాబోతున్నాట్లు సమాచారం.