రాజన్న సిరిసిల్ల జిల్లా: అంగన్వాడీలలో స్పాట్ ఫీడింగ్ పెంచడానికి హాజరు శాతం మెరుగుపరచడానికి రాగి లడ్డూల పంపిణీ( Ragi Laddu ) కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.ఈరోజు మూడవ వారం సిరిసిల్ల పట్టణంలో పలు కేంద్రాలను జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం సందర్శించారు.
ఈ సందర్భంగా మిషన్ వాత్సల్య నిధులతో అంగన్వాడీల( Anganwadis )లో ప్రీస్కూల్ పిల్లల హాజరు మెరుగుపడుతున్నట్లు గుర్తించారు.అలాగే గర్భవతులు బాలింతలు కూడా స్పాట్ ఫీడింగ్ విచ్చేసి పోషకాహారం తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
అంగన్వాడీలో అందుతున్నటువంటి సరుకులను నాణ్యతను పరిశీలించారు.అలాగే అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రమైన వాతావరణంలో, ఆరోగ్యకర వాతావరణంలో తయారు చేసిన రాగి లడ్డూలను పిల్లలకు పంపిణీ చేశారు.
గర్భవతులు బాలింతలు కూడా స్పాట్ పీడింగ్ కు హాజరై వారికి ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల పోషకాలతో కూడిన వేడివేడి భోజనాన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.ఈరోజు రగుడు చంద్రంపేట లోని పలు అంగన్వాడి కేంద్రాలను సందర్శించడం జరిగింది.
అలాగే సిడిపిఓ ఆనంద్( CDPO Anand ) ని మరియు డీసీపీ వాళ్లు కూడా వాళ్ళు అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు… జిల్లాలోని అన్ని సెక్టార్లలో సిడిపివోలు, సూపర్వైజర్లు అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి రాగి లడ్డూల పంపిణీని పరిశీలించారు.