మొట్ట మొదటి పీజీయోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి కే టి ఆర్

పీజీయోథెరపీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో రాష్ట్రంలోనే మొట్ట మొదటి పీజీయోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన మంత్రి కే టి ఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పీజీయోథెరపీ క్లినిక్ ను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం పీహెచ్ సి లో రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పీజీయోథెరపీ సేవలు ప్రారంభమయ్యాయి.ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.90 వేల తో ట్రాన్స్‌క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్ ఎలక్ట్రోథెరపీ వంటి పీజీయోథెరపీ పరికరాలను సమకూర్చి ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేశారు.సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో సేవలు అందించనున్నారు.

 Minister Ktr Started The Very First Physiotherapy Clinic ,minister Ktr ,first P-TeluguStop.com

పీజీయోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన అనంతరం సేవలు పొందేందుకు వచ్చిన అమృతవ్వ అనే వృద్ధురాలి నీ మంత్రి కే తారక రామారావు పలకరించారు.

బాగోగులు అడిగి తెలుసుకున్నారు.పీజీయోథెరపీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోనీ స్వస్థత పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీరాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube