ఏపీలోని రాజకీయ పార్టీల విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఎవరిని వద్దనుకునే పరిస్థితి లేదు.
ప్రస్తుతం టిడిపి తో పొత్తుల విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు తోనూ( Chandrababu Naidu ) చర్చించారు .అయితే ఇప్పటివరకు బిజెపి నుంచి ఏ క్లారిటీ ఇవ్వలేదు కానీ, టిడిపి తో కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలు మాత్రం బిజెపి ఉంది.

పొత్తులో భాగంగా ఎన్ని స్థానాలను తీసుకుని గెలవాలనే పట్టుదలతో ఉంది.అలా అని ప్రస్తుత ఏపీ అధికార పార్టీ వైసీపీతో( YCP ) పూర్తిస్థాయిలో విరోధం పెట్టుకునేందుకు బిజెపి సిద్ధంగా లేదు.జగన్ ( Jagan ) అవసరం రాబోయే రోజుల్లోనూ ఉండడం తో ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తోంది.
అందుకే బిజెపి కేంద్ర పెద్దలు జగన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను( Amit Shah ) కలిసి చాలా రోజులైనా ఇంకా ఈ విషయంలో ఏ క్లారిటీ ఇవ్వకపోవడం , ఏపీలో నాలుగు పార్లమెంట్ స్థానాలైన గెలుచుకోవాలంటే టీడీపీతో పొత్తు అవసరం బిజెపికి చాలా ఉంది.

అధికారికంగా పొత్తు ఇద్దరికీ లేకపోయినా ఒకరి అవసరం మాత్రం మరొకరికి ఉంది.ఇక చంద్రబాబు కూడా బిజెపికి అడిగినన్ని ఎంపీ స్థానాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.పొత్తుల విషయంలో ఏ క్లారిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో బిజెపి ఉంది.దీనికి కారణం రాజ్యసభలో వైసిపి బలం ఇప్పుడు 11 కు పెరిగింది.పెద్దల సభలో బిల్లులు ఆమోదం పొందాలంటే తప్పనిసరిగా వైసిపి మద్దతు అవసరం.2026 వరకు రాజ్యసభలో టిడిపి కి అవకాశం లేదు.

అందుకే వైసిపి విషయంలో బిజెపి ఆచితూచి వ్యవహరిస్తుంది.జగన్ బిజెపి అవసరం చాలా ఉంది.ఏపీలో ఇప్పటికే జనసేనతో( Janasena ) బిజెపి పొత్తు కొనసాగుతోంది.తాము కోరుకున్న విధంగా ఎంపి స్థానాలను గెలుచుకోవచ్చనే వ్యూహంతో బిజెపి ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ అవసరం ఎంతుందో చంద్రబాబు అవసరమూ బిజెపికి ఉంది.అలా అని ఇద్దరినీ దూరం పెట్టలేని పరిస్థితి.
అందుకే టీడీపీ తో పొత్తు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో బీజేపీ ఉంది.