నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టు( Nagarjunasagar project ) పరిధిలోని పలు ప్రాంతాలను గత రెండు రోజులుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు సందర్శించి పరిశీలిస్తున్నారు.దీనిలో భాగంగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం,భద్రత,నీటి వినియోగం,విద్యుత్ ఉత్పత్తి లాంటి పలు అంశాలపై పూర్తి నివేదికను తయారు చేస్తున్నారు.
బుధవారం నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్( Genco Chief Engineer Mangesh Kumar ) ఆధ్వర్యంలో జెన్కో సమావేశ మందిరంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, ఎంత పరిమాణంలో నీటిని వినియోగిస్తున్నాము, ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రివర్స్ బుల్ టర్బండ్ల పనితీరు,రివర్స్ బుల్ టర్బన్లు పనిచేస్తున్నప్పుడు జలాశయంలోకి నీటిని పంపే ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా వంటి పూర్తి వివరాలను సంబంధిత జెన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ బృందం చైర్మన్ ప్రస్తుత సిడబ్ల్యూసి డైరెక్టర్ రమేష్ కుమార్( CWC Director Ramesh Kumar ),సిడబ్ల్యూసి డైరెక్టర్ ఆశిష్ కుమార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్,స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజనీర్ కుమార్,స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎస్ఈ మురళీకృష్ణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ జిషన్, నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణులు రాకేష్,స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సిఈ ప్రమీల,ఎస్ఈ శ్రీనివాసులు,ఈఈ విజయలక్ష్మి,డిఈ సతీష్, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్,సాగర్ డ్యాం ఎస్ఈ నాగేశ్వరరావు,ఈఈ మల్లికార్జునరావు, ఆంధ్ర సిఈ మురళీధర్ రెడ్డి,కృష్ణా రివర్ బోర్డు ఎస్ ఈ వరలక్ష్మి దేవి,ఈఈ శ్రీహరిలు పాల్గొన్నారు.
అనంతరం ఈ బృందం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ను దాని పరిధిలోని కుడి కాలువ జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.గురువారం నాగార్జున సాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ కేంద్రo సందర్శించి పరిశీలించనున్నారు.
వీరితో పాటు సాగర్ డ్యాం డీఈలు శ్రీనివాస్ రావు, ఏఈలు కృష్ణయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.కాగా ఈ బృందం సాగర్ సందర్శనలో భాగంగా ప్రపంచములోనే రెండవ పురావస్తు ఐలాండ్ మ్యూజియం అయినా నాగార్జునకొండను సందర్శించారు.