Banana Crop : అరటి పంటను ఆశించే పసుపు, నలుపు సిగటోక తెగుళ్ల నివారణకు చర్యలు..!

అరటి పంటను( Banana crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే పసుపు, నలుపు సిగటోక తెగుళ్లు( Sigatoka pests ) ఒక ఫంగస్ ద్వారా వ్యాపిస్తాయి.ఈ తెగుళ్లు అరటి పంటలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

 Actions For The Prevention Of Yellow And Black Sigatoka Pests That Are Expected-TeluguStop.com

అధిక ఎత్తులో చల్లని వాతావరణం లేదా వెచ్చని వాతావరణం ఉంటే.వర్షాకాలంలో ఈ ఫంగస్ చనిపోయిన లేదంటే బతికి ఉన్న మొక్కల కణజాలాలపై జీవిస్తుంది.

ఈ తెగుళ్లు అరటి మొక్క లేత ఆకులను ఆశిస్తాయి.ఈ తెగులు సోకితే అరటి గెల పరిమాణం తగ్గుతుంది.

పైగా అరటి గెల త్వరగా పక్వానికి వస్తుంది.

Telugu Banana Crop, Banana, Black Sigatoka, Sunshine, Yellow-Latest News - Telug

ఈ తెగుళ్ల లక్షణాలు అరటి మొక్క ( Banana plant )లేత ఆకులపై గమనించవచ్చు.చిన్న, లేత పసుపు రంగు మచ్చలు ఆకులపై అంచుల వద్ద కనిపిస్తాయి.ఈ మచ్చలు వృద్ధి చెంది సన్నని గోధుమ లేదంటే ముదురు ఆకుపచ్చ మచ్చలుగా ఏర్పడతాయి.

ఈ తెగుళ్ల వల్ల దిగుబడి దాదాపుగా తగ్గే అవకాశం ఉంది.

Telugu Banana Crop, Banana, Black Sigatoka, Sunshine, Yellow-Latest News - Telug

ఈ తెగుళ్లు ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.అరటి మొక్క ఆకులు వీలైనంతవరకు పొడిగా ఉండే విధంగా నాటుకోవాలి.

అంటే మొక్కలకు సూర్యరశ్మి ( sunshine )బాగా తగిలే విధంగా నాటుకోవాలి.మొక్కల మధ్య అధిక దూరం ఉంటే ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

పొలంలో, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలను తొలగించాలి.పొలంలో తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడం కోసం పొటాషియం ఉండే ఎరువులను అధిక మోతాదులో వేయకూడదు.

ఈ తెగుళ్లు సోకిల మొక్కలను కత్తిరించి కాల్చి నాశనం చేయాలి.పంట కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చి నాశనం చేయాలి.

కేంద్రీయ పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టాలంటే.తెగులు సోకిన ఆకులను కత్తిరించి ఆ మొక్క భాగాలపై బోర్డియక్స్ ను పిచికారి చేయాలి.

ఒకవేళ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటే రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.మాంకోజెబ్, కాలిక్సిన్, ప్రోపికోనజోల్ లాంటి శిలీంద్ర నాశినిలను ఉపయోగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube