Banana Crop : అరటి పంటను ఆశించే పసుపు, నలుపు సిగటోక తెగుళ్ల నివారణకు చర్యలు..!

అరటి పంటను( Banana Crop ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే పసుపు, నలుపు సిగటోక తెగుళ్లు( Sigatoka Pests ) ఒక ఫంగస్ ద్వారా వ్యాపిస్తాయి.

ఈ తెగుళ్లు అరటి పంటలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.అధిక ఎత్తులో చల్లని వాతావరణం లేదా వెచ్చని వాతావరణం ఉంటే.

వర్షాకాలంలో ఈ ఫంగస్ చనిపోయిన లేదంటే బతికి ఉన్న మొక్కల కణజాలాలపై జీవిస్తుంది.

ఈ తెగుళ్లు అరటి మొక్క లేత ఆకులను ఆశిస్తాయి.ఈ తెగులు సోకితే అరటి గెల పరిమాణం తగ్గుతుంది.

పైగా అరటి గెల త్వరగా పక్వానికి వస్తుంది. """/" / ఈ తెగుళ్ల లక్షణాలు అరటి మొక్క ( Banana Plant )లేత ఆకులపై గమనించవచ్చు.

చిన్న, లేత పసుపు రంగు మచ్చలు ఆకులపై అంచుల వద్ద కనిపిస్తాయి.ఈ మచ్చలు వృద్ధి చెంది సన్నని గోధుమ లేదంటే ముదురు ఆకుపచ్చ మచ్చలుగా ఏర్పడతాయి.

ఈ తెగుళ్ల వల్ల దిగుబడి దాదాపుగా తగ్గే అవకాశం ఉంది. """/" / ఈ తెగుళ్లు ఆశించకుండా ఉండాలంటే.

తెగులు నిరోధక రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.అరటి మొక్క ఆకులు వీలైనంతవరకు పొడిగా ఉండే విధంగా నాటుకోవాలి.

అంటే మొక్కలకు సూర్యరశ్మి ( Sunshine )బాగా తగిలే విధంగా నాటుకోవాలి.మొక్కల మధ్య అధిక దూరం ఉంటే ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

పొలంలో, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలను తొలగించాలి.పొలంలో తెగుళ్ల ప్రభావం తక్కువగా ఉండడం కోసం పొటాషియం ఉండే ఎరువులను అధిక మోతాదులో వేయకూడదు.

ఈ తెగుళ్లు సోకిల మొక్కలను కత్తిరించి కాల్చి నాశనం చేయాలి.పంట కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చి నాశనం చేయాలి.

కేంద్రీయ పద్ధతిలో ఈ తెగుళ్లను అరికట్టాలంటే.తెగులు సోకిన ఆకులను కత్తిరించి ఆ మొక్క భాగాలపై బోర్డియక్స్ ను పిచికారి చేయాలి.

ఒకవేళ తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటే రసాయన పిచికారి మందులను ఉపయోగించాలి.మాంకోజెబ్, కాలిక్సిన్, ప్రోపికోనజోల్ లాంటి శిలీంద్ర నాశినిలను ఉపయోగించాలి.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!